in

గణేశ్ నిమజ్జనం: మానవత్వంతో అంబులెన్స్ కి దారి.. వీడియో వైరల్

పూణేలోని లక్ష్మీ రోడ్డులో నిన్న గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమైంది. అయితే ఎవరికో అనారోగ్యం తలెత్తడంతో అంబులెన్సు సదరు బాధితుడిని ఎక్కించుకుని ఆసుపత్రికి బయలుదేరింది. అయితే లక్ష్మీరోడ్డుకు చేరుకునేసరికి భారీఎత్తున ఊరేగింపు సాగుతోంది.

దీంతో అంబులెన్సు ముందుకు వెళ్లేందుకు దారి కనిపించలేదు. అయితే వెనుక అంబులెన్సును గమనించిన ప్రజలు మానవత్వంతో వ్యవహరించారు. వెంటనే అందరినీ తప్పుకోవాల్సిందిగా కోరుతూ దారిని కల్పించారు. దీంతో అంబులెన్సు వెళ్లేందుకు రోడ్డు క్లియర్ అయింది. అంబులెన్సు వీరిని దాటి వెళ్లగానే శోభాయాత్ర యధావిధిగా ముందుకు సాగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

500 మంది మహిళ కానిస్టేబుళ్లకు అభినందనలు: బాబు

జగన్ ఐదు ఎకరాల స్థలం హామీయిచ్చారు: పీవీ సింధు