in

కథానాయకుడు, మహానాయకుడు, ఛలో ఆత్మకూరు ఈ మూడు చెత్త సినిమాలు

టీడీపీ అధినేత చంద్రబాబును ట్విట్టర్ వేదికగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి టార్గెట్ చేశారు. గతంలో నిర్మించిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని తెలిపారు. ఎలక్షన్లలో ఘోర పరాజయం తర్వాత… ఇప్పుడు మళ్లీ ఛలో ఆత్మకూరు అనే చెత్త సినిమాను వదిలారంటూ ఎద్దేవా చేశారు.

కాగా ఇటీవలే ఛలో ఆత్మకూరు ప్రకటించిన చంద్రబాబు, ప్రభుత్వం నిర్వాకంతో చంద్రబాబుని, టీడీపీ నేతల్నిపోలీసులు గృహ నిర్బంధం చేసిన విషయం అందరికి తెలిసిందే. ఛలో ఆత్మకూరు ఒక చెత్త సినిమా అంటూ చంద్రబాబు తీరుపై మండిపడ్డారు విజయసాయిరెడ్డి.

ఈ ఛలో ఆత్మకూరు ని చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ చంద్రబాబుని అడ్డుకోవడంలో ప్రభుత్వం సఫలం అయిందనే చెప్పాలి. కాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పలు సంక్షేమ పథకాలతో దూసుకుపోతుంటే, చంద్రబాబు నాయుడు గారు ఏడుపు గోండి చర్యలతో మరింత పతనమవుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు విజయసాయిరెడ్డి.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

జగన్ ఐదు ఎకరాల స్థలం హామీయిచ్చారు: పీవీ సింధు

కోహ్లీ భావోద్వేగ ప్రసంగం.. కన్నీరు పెట్టుకున్న వీరుష్క