in

అనుకూల, ప్రతికూల అంటూ ఏం లేవ్.. ఆ ఛానళ్ల నిలిపివేత అప్రజాస్వామికం

రాష్ట్రంలో ఛానళ్ల నిలిపివేత అప్రజాస్వామికమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. శుక్రవారం విజయవాడలోని దాసరిభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావుతో కలిసి ఆయన మాట్లాడారు. తమకు అనుకూలంగా వార్తలు ఇవ్వడం లేదనే పేరుతో ఛానళ్లను నిలిపేయాలని మంత్రులు రంగంలోకి దిగడం సరైంది కాదని తెలిపారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియాకు తగు ప్రాధాన్యత ఉందని, ప్రభుత్వాలు ఎవరొచ్చినా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని తెలిపారు. అలాగే సమాచారశాఖ ద్వారా పత్రికలకు ఇస్తున్న ప్రకటనల్లోనూ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గతంలో తెలంగాణాలోనూ పలు ఛానళ్లను కెసిఆర్‌ నిలిపేయించారని, అదే సంస్కృతిని ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ అనుసరిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని తెలిపారు. రాజధానిపైనా మంత్రులు వేర్వేరు ప్రకటనలు చేస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని విమర్శించారు.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

బీజేపీ అంతర్గత ఎన్నికల షెడ్యూల్.. అధ్యక్షుడిగా..!

వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ ముఖ్య అతిథిగా వెంకీ