in

వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ ముఖ్య అతిథిగా వెంకీ

మెగా హీరో వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘వాల్మీకి’ ఈ నెల 20న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ కు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 15వ తేదీన హైదరాబాదులోని శిల్పకలావేదికలో జరగనుంది.

ఈ చిత్రానికి హీరో వెంకటేశ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. వెంకీ, వరుణ్ ల కాంబినేషన్లో వచ్చిన ‘ఎఫ్ 2’ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, వరుణ్ చిత్రానికి వెంకటేశ్ తన వంతుగా ప్రమోషన్ చేస్తున్నారు. ‘వాల్మీకి’ చిత్రంలో వరుణ్ సరసన పూజా హెగ్డే నటించింది. 14 రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించగా… హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

అనుకూల, ప్రతికూల అంటూ ఏం లేవ్.. ఆ ఛానళ్ల నిలిపివేత అప్రజాస్వామికం

అలిగి అత్తారింటిని విడిచిన మాజీ సీఎం కోడలు