in

‘అదే నువ్వు అదే నేను’ శాటిలైట్​ హక్కులను దక్కించుకున్న జెమిని ఫిలిమ్స్

హీరోగా పదేళ్లు పూర్తి చేసుకున్నారు నాగచైతన్య. ఇటీవలే ‘మజిలీ’ సక్సెస్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం చేస్తున్న ‘వెంకీ మామ’ షూటింగ్‌ కూడా చివరి దశలో ఉంది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఓ ప్రేమకథను ఈ మధ్యనే పట్టాలెక్కించారు నాగచైతన్య. ఇప్పుడు ‘దిల్‌ రాజు’ బ్యానర్‌లో నూతన దర్శకుడు శశి సినిమాలో యాక్ట్‌ చేయడానికి అంగీకరించారు. ఈ సినిమాకు ‘అదే నువ్వు అదే నేను’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. తొలిసారి రష్మిక మందణ్నతో కలిసి తెరపై సందడి చేయనున్నారు చైతూ..

తాజాగా ఓ ప్రముఖ మీడియా సంస్థ (జెమిని) ఈ సినిమా శాటిలైట్​ హక్కులు సొంతం చేసుకున్నట్లు ట్వీట్​ చేసింది. ఇప్పటికే కథ సిద్ధమైనా వీరిద్దరూ వేరే చిత్రాల్లో బిజీగా ఉండటం వల్ల చిత్రీకరణ ప్రారంభంకాలేదని సినీవర్గాలు అనుకుంటున్నాయి. అయితే వీటిపై దర్శకనిర్మాతలు అధికారికంగా ప్రకటన ఇవ్వాల్సి ఉంది. గతేడాది అక్టోబర్​లో ఇదే టైటిల్​తో సినిమాకు దిల్​రాజు పూజాకార్యక్రమం చేశారు.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

తెలంగాణ విమోచన దినోత్సవానికి బీజేపీ భారీ ఏర్పాట్లు

యురేనియం తవ్వకాలపై ‘పవన్ పోరాటం” చివరి వరకు నిలుస్తుందా?