in

డెంగీ నివారణ చర్యలపై హైకోర్టు సీరియస్

డేంజర్ డెంగీతో పాటు విష జ్వరాలు తెలంగాణలోని పలు జిల్లాలను వణికిస్తున్నాయి. హైదరాబాద్ సహా జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు రోగులతో నిండిపోయాయి.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ దగ్గర రోగులు చికిత్స కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ప్రభుత్వాసుపత్రుల్లో ఒకే పడకపై ఇద్దరు రోగులకు, నిలోఫర్‌లాంటి పిల్లల ఆస్పత్రుల్లో ఒకే బెడ్‌పై ముగ్గురు చిన్నారులను పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు.

వారం రోజుల వ్యవధిలో 1,200 మంది డెంగీ రోగులు ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించారంటే వ్యాధి తీవ్రతను అర్థం చేసుకోవచ్చని హైకోర్టు వ్యాఖ్యానించింది. రోగుల సంఖ్యకు అనుగుణంగా ఆసుపత్రుల్లో మంచాలు, మౌలిక సదుపాయాలు లేవని… వైద్య సిబ్బంది లేరని ఆక్షేపించింది.

డెంగీ నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. జల ప్రాణాలను హరిస్తున్న డెంగీ పట్ల అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతోందని హైకోర్టు ఘాటుగా పేర్కొంది. కోటికిపైగా జనాభా ఉన్న మహానగరంలో దోమల నివారణకు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగా ఉన్నాయంటూ తప్పుపట్టింది. రాజధానిలోనే పరిస్థితి ఇలా ఉందంటే జిల్లాలో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని తెలిపింది.

రానున్న రోజుల్లో దోమల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ప్రధాన న్యాయమూర్తి ఆర్​.ఎస్​ చౌహాన్, జస్టిస్​ ఎ.అభిషేక్​ రెడ్డితో కూడిన ధర్మాసనం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

హిందీ, హిందూ కంటే ‘ఇండియా” చాలా పెద్దది: అసదుద్దీన్‌

రాయుడు ఈజ్ బ్యాక్.. హైదరాబాద్ జట్టు పగ్గాలు