in

రాయుడు ఈజ్ బ్యాక్.. హైదరాబాద్ జట్టు పగ్గాలు

అంతర్జాతీయ క్రికెట్‌‌కు ప్రకటించిన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలుపుతూ, ఇటీవల రాయుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు లేఖ రాశాడు. సెలక్షన్‌కు తాను అందుబాటులో ఉంటానని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో అతడి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న అసోసియేషన్ రాయుడికి ఏకంగా హైదరాబాద్ జట్టు పగ్గాలు అప్పగించడం విశేషం.

ఈ నెల 24 నుంచి వచ్చే నెల 11 వరకు బెంగళూరులో జరగనున్న విజయ్ హజారే టోర్నీ కోసం హైదరాబాద్ జట్టును ప్రకటించిన సెలక్టర్లు అంబటికి సారథ్య బాధ్యతలు అప్పగించారు. బి.సందీప్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

డెంగీ నివారణ చర్యలపై హైకోర్టు సీరియస్

చిన్నారి లేఖ కి జగన్ రిప్లై