in

బాబు గెలుపుకోసం చివరకి ‘పసుపు-కుంకుమ” కూడా వదలలేదు: రోజా

వైసీపీకు చెందిన ఫైర్ బ్రాండ్ నగరి ఎమ్మెల్యే రోజా రాజకీయంగా టీడీపీని మరియు ఆ పార్టీ అధినేత చంద్రబాబును ఎన్నిసార్లు ఏకిపారేశారో ఇది వరకే మనం చాలా సార్లు చూసాం. అలాగే రోజా నోరు తెరిస్తే ఆ విమర్శనా స్థాయి ఎలా ఉంటుందో కూడా అందరికి తెలుసు. అదే విధంగా ఇప్పుడు మరోసారి రోజా చంద్రబాబు గత పాలనపై కొన్ని సంచలన కామెంట్స్ చేసారు.

చంద్రబాబు ఇప్పుడు తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని కానీ గతంలో టీడీపీ నేతలు అయినటువంటి కోడెల, అచ్చెన్నాయుడు యరపతినేని వంటి వారి వల్ల ఎన్నో ఇబ్బందులు పెద్దవారి కోసం ఎందుకు ఎలాంటి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చెయ్యలేదని సూటి ప్రశ్న వేస్తున్నానని తెలిపారు. అంతే కాకుండా సరిగ్గా ఎన్నికల ముందు సంక్షేమ పథకాలు అని చెప్పి పసుపుకుంకుమ పేరిట ప్రజలను మోసం చేసి మళ్ళీ గెలిచేద్దామని ప్రయత్నిస్తే దుర్మార్గుడు అయినటువంటి చంద్రబాబు పాలన మళ్ళీ తమకు అవసరం లేదని జగన్ కు 151 సీట్లు ఇచ్చి భారీ విజయాన్ని అందించారని సంచలనం రేపే కామెంట్స్ చేసారు.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

మోదీ జన్మదినం సందర్భంగా సేవా సప్తాహ కార్యక్రమం

కుక్కపిల్ల మీద ఉన్న సోయి.. తెలంగాణ బిడ్డల మీద లేకపాయే