in

కుక్కపిల్ల మీద ఉన్న సోయి.. తెలంగాణ బిడ్డల మీద లేకపాయే

కెసిఆర్ నివాస ప్రగతి భవన్‌లో 11 నెలల హస్కీ అనే కుక్క ఈ నెల 10న అనారోగ్యానికి గురైంది. బంజారాహిల్స్‌ లో యానిమల్‌ కేర్‌ క్లినిక్‌కు తీసుకెళ్లాడు డాగ్స్‌ హ్యాండ్లర్‌ ఆసిఫ్‌. వెటర్నరీ డాక్టర్ వైద్యం అందించినప్పటికీ హస్కీ మృతి చెందింది. దింతో హస్సీ మృతికి డాక్టరే కారణమంటూ కెసిఆర్ ప్రగతి భవన్‌లోని ఆసిఫ్‌ చేసిన ఫిర్యాదుతో బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో వివిధ సెక్షన్స్ క్రింద క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు.

కెసిఆర్ నివాస ప్రగతి భవన్ లోని చనిపోయిన కుక్కపిల్లకే ఇంత పెద్ద సీన్ క్రియేట్ చెయ్యాలా అంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి ప్రతిపక్షాలు. కుక్క పిల్ల మీద ఉన్న సోయి బంగారు తెలంగాణ మీద లేకపోయే అంటూ ట్వీట్స్ కూడా ఎక్కువే అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ, విషజ్వరాలు కమ్మేస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం తన భావనంలోని కుక్క పిల్లను పట్టించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాజధాని హైదరాబాద్ లోనే జనాలు హాస్పిటల్స్ పొంటి తిరుగుతూ పిట్టల రాలుతున్నారని గుర్తుచేస్తున్నారు. వీరందరికి వైద్యం చేసే డాక్టర్స్ కి ఎంతది శిక్షలు వెయ్యాలో కెసిఆర్ గారే చెప్పాలని కోరుతున్నారు. తెలంగాణలో అస్సలు ఆరోగ్య శాఖ మంత్రి అంటూ ఉన్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉంటె గనుక మొదటగా అతన్ని బాధ్యతల నుంచి తొలగించాలి అంటూ నిలదీస్తున్నారు.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

బాబు గెలుపుకోసం చివరకి ‘పసుపు-కుంకుమ” కూడా వదలలేదు: రోజా

ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేయాల్సిన పని లేదు, పోలీసులకి దొరికిపోతే చాలు