in

కేసీఆర్ ఒక మాట, కేటీఆర్ ఇంకో మాట

మోటార్ వెహికల్ చట్టంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష సభ్యుడు అడిగిన ఓ ప్రశ్నకు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. కొత్త చట్టం వచ్చిన తర్వాత..రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలని, ఇలాంటి చట్టం అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

దీనిపై సీఎం కేసీఆర్ రెస్పాండ్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వెహికల్ చట్టాన్ని అమలు చేయబోమని తేల్చిచెప్పారు సీఎం కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వమే కొత్త చట్టం తీసుకొస్తుందని, ఎలాంటి తొందర లేదన్నారు. ప్రజలను ఇబ్బందులు పెట్టే విధంగా చర్యలు ఉండవని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.

సెప్టెంబర్ 01వ తేదీ నుంచి కొత్త మోటార్ వెహికల్ చట్టం అమల్లోకి వచ్చాక..ట్రాఫిక్ చలాన్ల బాదుడు షురూ అయ్యింది. దీంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. దేశంలో
ఇప్పటివరకు ట్రాఫిక్ సిబ్బంది జారీ చేసిన చలాన్లు రికార్డు సృష్టిస్తున్నాయి. లక్షల్లో ఫైన్‌లు ఉంటుండడంతో లబోదిబోమంటున్నారు. కొన్ని రాష్ట్రాలు దీనిని అమలు చేయడం లేదని చెప్పగా..ఇతర రాష్ట్రాలు జరిమానాలను తగ్గిస్తున్నాయి.

అయితేకేంద్రం తీసుకొచ్చిన ఈ కొత్త మోటారు వెహికల్ చట్టంపై కేటీఆర్ మాత్రం ఇంకోలా స్పందించారు ఇంతకుముందు. ఇలాంటి చట్టాలు అవసరం అని, అప్పుడే ప్రజలకు భయం ఉంటుందని, ట్రాఫిక్ రూల్స్ ని తప్పరని అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ చట్టానికి పూర్తి మద్దతు తెలిపారు.

ఈ విషయాన్ని గుర్తు చేస్తూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. తండ్రి ఒక మాట చెప్తాడు, కొడుకు ఒక మాట చెప్తాడు. వాళ్ళకే క్లారిటీ లేదు అని ట్రోల్ల్స్ చేస్తున్నారు.

ఏది ఏమైనా కెసిఆర్ చెప్పిన మాట కాస్త తెలంగాణ వాహనదారులకు ఊరటనిచ్చే వార్తే.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేయాల్సిన పని లేదు, పోలీసులకి దొరికిపోతే చాలు

చిరంజీవి జెండా @ ఇండియా గేట్