in

చిరంజీవి జెండా @ ఇండియా గేట్

చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా అక్టోబర్ 2వ తేదీన విడుదలకు సిద్ధమవుతుంది. 

ఈ ‘సైరా’ చిత్రం జెండాను దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఈ రోజు ఆవిష్కరించారు. అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు ఆర్.స్వామినాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సినిమాను చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ‘కొణిదెల ప్రొడక్షన్స్’పై నిర్మించారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అమితాబచ్చన్, కన్నడ స్టార్ సుదీప్, తమిళ హీరో విజయ్ సేతుపతి, అనుష్క, నయనతార, జగపతి బాబు ఇలా బారి తారాగణం నటించారు.

ఈ సినిమా అక్టోబర్ 2 నుంచి 12కు పోస్ట్ పోన్ అవుతుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇంకా దీనిపై సరైన స్పష్టత రావలసి ఉంది.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

కేసీఆర్ ఒక మాట, కేటీఆర్ ఇంకో మాట

వరుణ్ తేజ్ కి తెలంగాణ హైకోర్టు నోటీసులు