in

బిగ్ బాస్ 3: శిల్పా చక్రవర్తి ఔట్

ఈ వారం ఎలిమినేషన్ ప్రకియలో శ్రీముఖి, శిల్పా చక్రవర్తి, పునర్నవి, మహేష్ విట్టా ఉన్నారు. ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా నాగార్జున హౌస్ మేట్స్‌ మంచి టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా శ్రీముఖి, శిల్పాచక్రవర్తిలకు ఇచ్చిన టాస్క్ హౌస్‌లో నవ్వులు పూయించింది. ముఖ్యంగా శ్రీముఖి.. మగ గొంతుతో మాట్లాడిన తీరు ఆకట్టుకుంది. మరోవైపు మహేష్ విట్టా.. శ్రీముఖిని పెళ్లి చూపులు చూడడానికి వచ్చిన తీరు నవ్వు తెప్పించింది. మరోవైపు శ్రీముఖి, వితిక షేరు, బాబా భాస్కర్ తిరుమల ఎపిసోడ్ కూడా హౌస్‌లో రంజుగా సాగింది.

వైల్డ్‌కార్డు ఎంట్రీ ద్వారా తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన యాంకర్, నటి శిల్పా చక్రవర్తి ఆదివారం ఎలిమినేట్ అయింది. తొలి వారం ఎలిమినేషన్ నుంచి మినహాయింపు దక్కినప్పటికీ రెండో వారం తప్పించుకోలేకపోయింది. నిజానికి శిల్ప రాకతో షో మరింత ఆసక్తిగా మారుతుందని అందరూ భావించారు. అయితే, ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల నుంచి స్పందన రాలేదు. అతి తక్కువ ఓట్లు దక్కించుకున్న శిల్ప ఎలిమినేట్ కాక తప్పలేదు.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

భారతీయుల పట్ల ఆత్మీయబంధం ఉంది

ఎంతో కష్టంతో ఉద్యోగాలు సాధించారు.. తొలి వేతనంతోనే..