in

ఆంధ్రా రాజధాని మార్పు: కథ, కథనం కెసిఆర్?

ఏపీలో రాజధానిగా అమరావతి కొనసాగింపు పైన రగడ కొనసాగుతుండగానే.. తెలంగాణ ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేసారు. అమరావతి నిర్మాణం పైనే ఆయన వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తాను సూచనలు చేసానని.. అయినా వినలేదని చెప్పుకొచ్చారు. దీని ద్వారా కేసీఆర్ అవే వ్యాఖ్యలు సైతం ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ కూ చెప్పారా అనే చర్చ మొదలైంది.

కేసీఆర్ సూచనల మేరకే జగన్ అమరావతి విషయంలో అలా వ్యవహరిస్తున్నారా అనే సందేహాలు పొలిటికల్ సర్కిల్స్ లో మొదలయ్యాయి. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత అమరావతి నిర్మాణాలు నిలిపివేసారు. 25 శాతం పూర్తి చేసుకోని నిర్మాణాలను రద్దు చేసారు. తాజాగా ఆర్దిక మంత్రి బుగ్గన అమరావతి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవంటూ తేల్చి చెప్పారు. అయితే.. ఇప్పుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, అమరావతి పైన మంత్రి బొత్సా చేసిన వ్యాఖ్యలు ఒకే విధంగా ఉన్నాయనే అభిప్రాయం కలుగుతోంది.

ఏపీలో టీడీపీ ఓడి వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సఖ్యతగా ఉంటున్నారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా నీటి పంపకాల మీద చర్చలు చేసారు. అయితే, చంద్రబాబుతో అమరావతి నిర్మాణం వద్దని చెప్పానని స్వయంగా కేసీఆర్ వెల్లడించారు. అప్పుడు చెప్పిన కేసీఆర్.. తనతో సన్నిహితంగా ఉంటున్న ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ కు సైతం చెప్పి ఉంటారని అంచనా వేస్తున్నారు.

అయితే, సెంటిమెంట్ తో ముడి పడి ఉండటంతో ముఖ్యమంత్రి జగన్ నేరుగా నిర్మాణాలు ఆపివేస్తున్నట్లుగా చెప్పకుండా.. అవినీతి జరిగిందంటూ 25 శాతం లోపు జరిగిన నిర్మాణాలను నిలుపుదల చేసారు.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

భారీగా పెరగనున్న పెట్రోల్ ధరలు

శుభ‌శ్రీ ఎఫెక్ట్: అభిమానులకు సూర్య రిక్వెస్ట్