in

బిగ్ బాస్: వాళ్ళిద్దరి మధ్య సంథింగ్.. సంథింగ్…

బిగ్ బాస్ హౌస్‌లో వాళ్ల ఇద్దరి మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ నడుస్తోంది. లవ్ ట్రాక్ మొదలైంది.. డేటింగ్‌పై ఇద్దరి మధ్య చర్చ నడుస్తోంది.. బిగ్ బాస్ షో చూస్తున్న ప్రేక్షకులతో పాటు హోస్ట్ చేస్తున్న నాగార్జున.. గెస్ట్ హోస్ట్‌గా వచ్చిన రమ్యక్రిష్ణ సైతం ఈ ఇద్దరూ లవ్ ట్రాక్ నడుపుతున్నారనే పంచ్ పేల్చేవారు. ఆ ఉప్పు నిప్పు ప్రేమ జంటకు పెద్ద పరీక్ష పెట్టి పెట్టారు బిగ్ బాస్.

ప్రస్తుత సీజన్ బిగ్ బాస్ హౌస్ లో మంచి స్నేహితులుగా ఎవరినైనా చెప్పాలంటే, అందులో మొదట ఉండేది రాహుల్ – పునర్నవి జోడీయే. ఇక, వీరిద్దరి మధ్యా గత నాలుగైదు రోజులుగా గొడవలు రాగా, బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ తో వీరిద్దరూ కలిసి పోయారు. అది కూడా అలా ఇలా కాదు. వీరి హగ్స్, కిస్ లు ఇప్పుడు తెగ వైరల్ అయిపోతున్నాయి.

తన కోసం 20 కాకరకాయ జ్యూస్ లను రాహుల్ తాగగలడా? అని పునర్నవి వ్యక్తం చేసిన సందేహాన్ని పటాపంచలు చేస్తూ, రాహుల్ విజయవంతంగా టాస్క్ ను పూర్తి చేయగా, పునర్నివి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. రాహుల్ ను గట్టిగా హత్తుకుని ముద్దు మీద ముద్దులు పెట్టింది. కాకరకాయ రసం తాగడమంటే మామూలు విషయం కాదు. అటువంటిది తనను గట్టున పడేసేందుకు రాహుల్ చేసిన పని పునర్నవికి అమితానందాన్ని కలిగించగా, చూస్తున్న వీక్షకులకు ఫుల్ రొమాన్స్ కనిపించింది. ఇక వీరిద్దరి లేటెస్ట్ రొమాన్స్ పై సామాజిక మాధ్యమాల్లో వందల కొద్దీ మీమ్స్ వచ్చాయి.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

తెలంగాణ భవన్‌లో జాతీయ పతాకం ఎగురవేసిన కేటీఆర్

‘నవ్వెందుకు”.. సమయం చాలట్లేదట