in

మోదీకి బర్త్ డే విషెస్ తెలియజేసిన జగన్, కేటీఆర్

నేడు నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు జరుపుకుంటుండగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో విషెస్ పోస్ట్ చేశారు.గౌరవనీయ ప్రధాని నరేంద్ర మోడీ గారికి నా పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో చిరకాలం విజయవంతమైన జీవితాన్ని గడపాలని, జాతికి సేవ చేయాలని కోరుకుంటున్నాను అని జగన్ వ్యాఖ్యానించారు.

ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోదీ 69వ పుట్టిన రోజు సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆయనకు బర్త్‌డే విషెస్ చెప్పారు. ఆయురారోగ్యాలతో, సంతోషంతో మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటూ.. సుదీర్ఘ కాలం ప్రజలకు సేవ చేయాలని కేటీఆర్ ట్వీట్ చేశారు.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

రైతుబంధు: ఆ చెల్లింపులు ప్రాసెస్ లో ఉన్నాయి

నూతన అసెంబ్లీ నిర్ణయంపై హైకోర్టు తాజా తీర్పు