in

‘లవంగాలే’ కాదని తీసిపారేయకండి.. ఊపిరితిత్తుల..?

15777920 - fresh cloves with green clove leaf

విచ్చీవిచ్చని పూమొగ్గలే లవంగాలు. అందుకే మనం వీటిని ముద్దుగా లవంగమొగ్గలనీ పిలుస్తుంటాం. ఇండొనేషియాలోని స్పైస్‌ ఐల్యాండ్స్‌గా పిలిచే మొలక్కస్‌ దీవులే వీటి స్వస్థలం. ప్రస్తుతం వీటిని బ్రెజిల్‌, ఇండియా, వెస్టిండీస్‌, మారిషస్‌, జాంజిబార్‌, శ్రీలంక, పెంబా దేశాల్లోనూ పండిస్తున్నారు.

మన దేశంలోనే కాదు అనేక దేశాల్లోనూ లవంగాలను మసాలా దినుసుగా వాడుతారు. వీటిని వంటల్లో వేస్తే వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. ఇక లవంగాలు వేయకుండా నాన్ వెజ్ వంటలను వండరు. ఇవి అంతలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

లవంగాల్లో యుజెనాల్, ఫ్లేవోన్స్, ఐసో ఫ్లేవోన్స్, ఫ్లేవనాయిడ్స్ అని పిలవబడే ఫీనోలిక్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఎముకలను రక్షిస్తాయి. దీంతో వయస్సు మీద పడడకం కారణంగా వచ్చే ఆస్టియో పోరోసిస్ (ఎముకలు గుల్లబారిపోవడం)ను తగ్గిస్తాయి

ఊపిరితిత్తుల క్యాన్సర్ మొదటి దశలో ఉంటే అలాంటి వారు లవంగాలను రోజూ తింటే క్యాన్సర్ బారి నుంచి తప్పించుకోవచ్చని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. లవంగాల్లో ఉండే యాంటీ కార్సినోజెనిక్ గుణాలు క్యాన్సర్ కణాలతో పోరాడి వాటిని నాశనం చేస్తాయి.

డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నవారు నిత్యం తమ ఆహారంలో లవంగాలను చేర్చుకుంటే దాంతో అద్భుతమైన ఫలితం ఉంటుందని సాక్షాత్తూ వైద్యులే చెబుతున్నారు. లవంగాల్లో ఉండే ఇన్సులిన్ వంటి గుణాలు రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్దీకరిస్తాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

హరీశ్‌రావుతో.. కోమటిరెడ్డి భేటీ.. జంపింగ్?

సాక్షిని టార్గెట్ చేసిన బాబు