in

ఇది కెసిఆర్ కి జగన్ ఇస్తున్న గిఫ్టా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం 24 మంది సభ్యులతో  తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలిని ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం నుంచి 8మందికి, తెలంగాణ నుంచి ఏడుగురుకి అవకాశం కల్పించింది.  అంతేకాదు తమిళనాడు నుంచి నలుగురు, కర్నాటక నుంచి ముగ్గురు, ఢిల్లీ, మహారాష్ట్న నుంచి ఒక్కొక్కరికి పాలకమండలిలో స్థానం దక్కింది. 

ఏపీ నుంచి ఎమ్మెల్యేలు  యూవీ రమణమూర్తి, మల్లిఖార్జున రెడ్డి, గొల్ల బాబురావు, కె. పార్ధసారధి రెడ్డిలతో పాటు   వి.పార్ధసారథి, నాదెండ్ల సుబ్బారావు, చిప్పగిరి ప్రసాద్ కుమార్, డీపీ అంతాలను బోర్డు సభ్యులుగా తీసుకున్నారు.

తెలంగాణ రాష్ట్రం నుంచి జే. రామేశ్వర రావు, బి. పార్ధసారథి రెడ్డి, యు. వెంకట భాస్కర రావు, మూరంశెట్టి రాములు, డి. దామోదర్ రావు, కె.శివకుమార్, పుట్టా ప్రతాప్ రెడ్డిలకు అవకాశం కల్పించారు.

ఢిల్లీ కి చెందిన  ఎంఎస్ శివ శంకర్‌, కర్ణాటకకు చెందిన  రమేష్ శెట్టి, సంపత్ రవి నారాయణతో పాటు ఇన్ఫోసిస్ సుధానారాయణ మూర్తిలను పాలకమండలి సభ్యులుగా నియమించారు. మహారాష్ట్ర నుంచి రాజేష్‌ శర్మను సభ్యుడిగా తీసుకున్నారు. 

టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డితో కలుపుకుని మొత్తం పాలకమండలి సభ్యులు సంఖ్య 25.  వీరు కాకుండా తుడా ఛైర్మన్, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ, దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్, టిటిడి బోర్డు కార్యనిర్వహణాధికారి ఎక్స్ అఫిషియో సభ్యులుగా కొనసాగుతున్నారు.ఏపీలో ప్రకటించిన పేర్లను చూస్తే.. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ కొందరికి టీటీడీ సభ్యులుగా అవకాశం కల్పించినట్లు స్పష్టమవుతోంది.

వీరందరిలో తెలంగాణ కి కేటాయించిన సీట్లే ఎక్కువ. ఇదంతా చూస్తుంటే ఇది జగన్ కెసిఆర్ కి ఇస్తున్న గిఫ్టులా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కెసిఆర్ కోరితే జగన్ సెట్ చేశాడా ఇలా లేదంటే జగన్ కావాలనే ఇలా ప్లాన్ చేశాడా?

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

video : లంచం అడిగిన ఖమ్మం పోలీసులకు బుద్ధి చెప్పిన భారతీయుడు

జనసేన అకౌంట్లు సస్పెండ్, టీడీపీ స్మార్ట్ ప్లాన్ వర్కౌట్