in

జనసేన ట్విట్టర్ ఖాతాలు సస్పెండ్ కి కారణం ఇదేనా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు షాక్ తగిలింది. భారీ సంఖ్య లో జనసేన పార్టీకి సంబంధించిన ట్విట్టర్ ఖాతాలు సస్పెండ్ చేయడంతో జన సైన్యం ఆగ్రహంతో మండిపడుతున్నారు. ట్విట్టర్ రూల్స్ ను అతిక్రమించారనే కారణంతో 400 ట్విట్టర్ ఖాతాలను సస్పెండ్ జనసేన పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే కొద్ది రోజులుగా జ‌న‌సైనికులు పవ‌న్ పిలుపు మేర‌కు నల్లమల అడవిలోని యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ప్ర‌చారం చేస్తున్నారు. వైస్ జ‌గ‌న్ ఫేయిల్డ్ యాస్ సీఎం తో పాటు సేవ్ న‌ల్ల‌మ‌ల అనే యాష్ ట్యాగ్‌తో మ‌రి ట్రెండ్ చేస్తున్నారు. ఇది ట్విట్ట‌ర్ ప్లాట్‌ఫాం నిబంధ‌న‌ల‌కి విరుద్దం. ఈ కార‌ణంగా మీ ట్విట్ట‌ర్ అకౌంట్స్ స‌స్పెండ్స్ చేస్తున్నామ‌ని మెయిల్ వ‌చ్చాయ‌ట‌.

దాదాపు 400 మంది అకౌంట్స్ స‌స్పెండ్స్ కావ‌డంతో జ‌న‌సైనికులు షాక్‌కి గుర‌య్యారు. సోష‌ల్ మీడియా ద్వారా త‌మ గొంతుని స్ట్రాంగ్‌గా వినిపిస్తున్న స‌మ‌యంలో ట్విట్ట‌ర్ యాజ‌మాన్యం ఇలా చేయ‌డం దారుణ‌మైన సంఘ‌ట‌న అని జ‌న‌సైనికులు వాపోతున్నారు.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

సర్పంచ్, ఉపసర్పంచ్ చెక్ పవర్ విషయంలో..

హీరో నాగార్జున పొలంలో దొరికిన శవం ఎవరిది?