in

ఇండియా Vs పాకిస్తాన్: అలా వెళ్ళడానికి వీల్లేదని, మోడీకి నో చెప్పిన పాక్

ప్రధాని మోదీ అమెరికా పర్యటన కోసం తమ గగనతలాన్ని వినియోగించుకోవద్దని పాక్​ తెలిపింది. పాక్​ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టిన భారత్​.. ఏకపక్ష నిర్ణాయలు తీసుకోకూడదని హితవు పలికింది.

ప్రధాని మోదీ త్వరలో అమెరికా​ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్​ గగనతలం నుంచి వెళ్లేందుకు ఆ దేశ అనుమతి కోరింది భారత్. కానీ అందుకు దాయాది దేశం అంగీకరించలేదు. ఈ విషయాన్ని పాక్​ విదేశాంగ మంత్రి మహ్మద్​ ఖురేషీ బుధవారం తెలిపారు.

జమ్ము కశ్మీర్​ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్​ తమ గగనతలంలోకి భారత్​ విమానాలను నిషేధించింది.

మోదీ పర్యటన విషయాన్ని భారత్​.. గతవారం పాకిస్థాన్​ దృష్టికి తీసుకెళ్లింది. కానీ అందుకు అంగీకరించేది లేదని భారత రాయబార కార్యాలయానికి తెలిపారు ఖురేషీ.

ఖండంచిన భారత్

పాకిస్థాన్​ నిర్ణయాన్ని భారత్​ ఖండించింది. అంతర్జాతీయ కార్యకలాపాల విషయంలో పాకిస్థాన్​ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడాన్ని పునఃపరిశీలించుకోవాలని భారత్​ హితవు పలికింది.

కొద్దిరోజుల కిందట రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఐస్​లాండ్​​ పర్యటనకు తమ గగనతలాన్ని వినియోగించుకునేందుకు పాక్​ నిరాకరించింది. మళ్లీ ఇప్పుడు అదే పంథాలో వెళ్తోంది.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

ఉత్తమ్ కుమార్ రెడ్డి కి షోకాజ్ నోటిస్ – రేవంత్ రెడ్డి

మోదీ అమెరికా పర్యటన.. పాక్ అబ్జెక్షన్