in

సోదరుడి ప్రేమ ఆచూకీ కోసం.. ముగ్గురు అక్కాచెల్లెళ్లను వివస్త్రల్ని చేసి..

మహిళలని చూడకుండా ఇష్టారీతిలో వ్యవహరించారు అసోం పోలీసులు. ముగ్గురు అక్కాచెల్లెళ్లను స్టేషన్‌కు పిలిపించి మరీ వివస్త్రల్ని చేసి విపరీతంగా కొట్టారు. ఆ ముగ్గురిలో ఒకరు గర్భిణి అనే విషయాన్ని కూడా పట్టించుకోని పోలీసుల దురహంకారంతో ఆమెకు గర్భస్రావమయింది. కఠినాత్ములను సైతం కదిలించే ఈ ఘటన అసోంలోని దర్రాంగ్‌ జిల్లాలోని సిపాఝార్‌ పోలీసు స్టేషన్‌లో జరిగింది.

ఈ దారుణానికి ఒడిగట్టిన పోలీసుల్లో ఓ మహిళా కానిస్టేబుల్‌ ఉండటం మరింత బాధకలిగించే విషయం. కనీస మానవత్వం లేకుండా వ్యవహరించిన పోలీసు అధికారిని, మహిళా కానిస్టేబుల్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.ముగ్గురు అక్కాచెల్లెళ్లను, వారిలో వివాహిత అయిన యువతి భర్తను పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చి కొట్టడానికి మరో కుటుంబం వీరిపై చేసిన ఫిర్యాదే కారణం.

బాధిత మహిళల సోదరుడు తాను ప్రేమించిన స్థానిక యువతితో కలిసి ఇటీవల ఎక్కడికో వెళ్లిపోయాడు. వారిద్దరివీ వేర్వేరు మతాలు కావటం వల్ల విషయం పెద్ద వివాదమైంది.అమానవీయంగా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు చేపట్టాలని జాతీయ మహిళా సంఘం(ఎన్‌సీడబ్ల్యూ) డిమాండ్‌ చేసింది. దింతో ఇద్దరి పోలీస్ అధికారులను సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తుంది.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

వెంకీతో ‘హాగ్’ బాధనిపించింది

ప్రతీ కార్మికుడికి 1,00,899 రూపాయల బోనస్