in

బోటు జాడ దొరికింది.. 60 రోజుల్లో నివేదిక

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కచులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన లాంచీ జాడ లభ్యమయింది. లాంచీ 70 నుంచి 80 మీటర్ల లోతులో ఉన్నట్టు ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తుల సాంకేతిక బృందం సోనార్ సిస్టమ్ ద్వారా గుర్తించింది. బుధవారం ఆరు మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో పడవ ప్రమాదంలో మృతిచెందినవారి సంఖ్య 34కి చేరింది.

బుధవారం లభ్యమైన మృతదేహాల్లో వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండకు చెందిన బస్కె రాజేంద్రప్రసాద్ , దోమల హేమంత్ తోపాటు, హైదరాబాద్ రామంతాపూర్ ఆర్టీసీకాలనీకి చెందిన సుశీల్ మృతదేహాన్ని గుర్తించారు. వాటిని ప్రత్యేక అంబులెన్స్‌ లలో రాజమహేంద్రవరం నుంచి స్వస్థలాలకు పంపించారు.

లాంచీలో మొత్తం 73మంది ఉండగా.. ప్రమాదం జరిగినప్పుడు 26 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఇప్పటికి మొత్తం 34 మృతదేహాలు లభించగా.. మిగిలినవారికోసం గాలింపు జరుగుతున్నది. కాగా, పడవ ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్ నేతృత్వంలో మెజిస్టీరియల్ దర్యాప్తునకు ఆదేశించింది.

60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించింది. చివరి మృతదేహం దొరికే వరకు గాలింపు చర్యలు కొనసాగుతాయని ఏపీ డీజీపీ గౌతమ్‌సవాంగ్, మంత్రి కన్నబాబు తెలిపారు.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

మీడియాలో నిజాయితీ లేదు. మొత్తం మోసకారులే

కోహ్లీ ఆట తీరుపై ఆఫ్రిది కామెంట్