in

కోహ్లీ ఆట తీరుపై ఆఫ్రిది కామెంట్

టీమిండియా కెప్టెన్‌, స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీ పై పాకిస్థాన్‌ మాజీ ఆల్‌ రౌండర్‌ షాహిద్‌ అఫ్రీది ప్రశంసలు కురిపించారు. కోహ్లీ ఒక అసాధారణ ఆటగాడని కొనియాడారు. దక్షిణాఫ్రికాతో తాజాగా జరిగిన రెండో టీ-20 మ్యాచ్‌లో కోహ్లీ అర్ధశతకం సాధించిన నేపథ్యంలో..
అంతర్జాతీయ టీ-20 ల్లో అత్యధిక హాఫ్‌ సెంచరీలు సాధించిన ఆటగాడిగా రోహిత్‌ శర్మను దాటి కోహ్లీ (22 హాఫ్‌ సెంచరీలు) అగ్రస్థానంలో నిలిచారు.

ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఐసీసీ ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్‌ను రీట్వీట్‌ చేసిన అఫ్రీది.. ” అభినందనలు కోహ్లీ. నువ్వొక అసాధారణ ఆటగాడివి. నీ సక్సెస్‌ను ఇలాగే కొనసాగించు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ ప్రేమికులందరినీ అలరించు ” అని కామెంట్‌ చేశారు.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

బోటు జాడ దొరికింది.. 60 రోజుల్లో నివేదిక

ఐఫా అవార్డ్స్: విజేతలు వీళ్ళే