in

నగరంలో భారీ వర్షం

తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్, భారీగా వర్షపాతం నమోదైంది. ఇక హైదరాబాద్ అంతటా వాతావరణం మారిపోయింది. కోఠి, అబిడ్స్, నాంపల్లి, నారాయణగూడ, ట్యాంక్ బండ్, ఇందిరాపార్క్, ఆర్టీసీ క్రాస్ లలో భారీగా వర్షపాతం నమోదైంది. ఇక మరో రెండు రోజులు తెలంగాణ అంతట ఇదే వాతావరణం ఉండొచ్చునని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఇక ముఖ్యంగా నల్గోండ గతంలో ఎన్నడు లేని విధంగా భారీ వర్షాలు కురిసాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. నల్గొండలో 6 గంటల్లోనే 20మి.మి వర్షపాతం నమోదైంది. వంద సంవత్సరాల క్రితం తర్వాత మళ్లీ ఇంత భారీగా వర్షాలు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

పార్టీ నేతలతో బాబు భేటీ

14 ఏళ్ల తర్వాత..