in

Howdy, Modi : ట్రంప్ సంచలన ప్రకటన అదేనా?

అమెరికాలోని హ్యూస్టన్‌లో ఈ నెల 22న నిర్వహించబోయే `హౌడీ మోదీ’ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నది. ఈ మేరకు ఆయన సంకేతాలిచ్చారు. హౌడీ మోదీ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ట్రంప్ కూడా హాజరుకానున్నారు. సుమారు 50,000 మంది ప్రవాస భారతీయుల సమావేశం వేదికను ఆయన పంచుకోవడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉందా అని విలేకరులు ప్రశ్నించగా.. ఉండొచ్చు. ప్రధాని మోదీతో నాకు మంచి అనుబంధం ఉన్నది అని ట్రంప్ సమాధానమిచ్చారు. 

మోదీ సభకు ముందే వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు ఇరు దేశాలు ప్ర యత్నిస్తున్నట్లు అమెరికా మీడియా వర్గాలు తెలిపాయి. తమ ఉత్పత్తులపై భారత్ భారీ సుంకాలు విధిస్తున్నదని, దీన్ని ఇకపై అనుమతించబోమని ట్రంప్ పేర్కొనడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు పెరిగిన విషయం తెలిసిందే. అలాగే భారత్‌కు కల్పిస్తున్న ప్రాధాన్య హోదాను (జీఎస్పీ) కూడా ట్రంప్ సర్కారు ఉపసంహరించుకుంది. దీంతో జూన్ 5న భారత్.. అమెరికాకు చెందిన 25 ఉత్పత్తులపై సుంకాలను పెంచింది.  

కాగా మూడు నెలల్లో ఇరువురు నేతలు కలుసుకోవడం ఇది మూడో సారి. గత జూన్‌లో జపాన్‌లో జరిగిన జి20 సదస్సులో కలుసుకున్న తర్వాత గత నెల ఫ్రాన్స్‌లో జరిగిన జి7 సమావేశంలో కూడా ఇరువురు కలుసుకున్నారు.  

21నుంచి 27 వరకు అమెరికాలో మోదీ పర్యటన  

ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 21నుంచి 27 వరకు అమెరికాలో పర్యటిస్తారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం కావడంతో పాటుగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వార్షిక సమావేశంలో ప్రసంగిస్తారని విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే చెప్పారు. మోడీ శనివారం హూస్టన్‌కు చేరుకుంటారు. ఆ మర్నాడు అక్కడ జరిగే హౌడీమోడీ ర్యాలీలో పాల్గొంటారు. ఆ ర్యాలీలో మోడీతో పాటుగా ట్రంప్‌కూడా పాల్గొంటారు.

‘ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నంనుంచి 27వ తేదీ ఉదయం దాకా అమెరికాలో పర్యటిస్తారు. ఆయన పర్యటన కార్యక్రమంలో ఉన్న రెండు నగరాలు టెక్సాస్‌లోని హూస్టన్, న్యూయార్క్’ అని గోఖలే తెలిపారు. ప్రధాని మోడీ ఈ నెల27న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ప్రసంగిస్తారని గోఖలే తెలిపారు. 

అక్టోబర్ 2న ప్రపంచం జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని జరుపుకుంటున్న నేపథ్యంలోఈ నెల 24న‘ నాయకత్వం: సమకాలీన ప్రపంచంలో గాంధీజీ ప్రాధాన్యత’ అనే అంశంపై ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో కూడా మోడీ ప్రసంగిస్తారు. ఆయనతో పాటుగా కొన్ని దేశాల నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

డెంగీ పంజా.. దోచేస్తున్న డాక్టర్లు

జగన్, కెసిఆర్ ల భేటీ