in

బిగ్ బాస్ కి తలనొప్పిగా మారిన నెటిజన్లు

ప్రోమో తోనే, ప్రోగ్రాం అంత చెప్పేస్తున్న నెటిజన్లు

ప్రేక్షకుని సహనానికి పరీక్ష పెడుతున్న బిగ్ బాస్

రొమాన్స్ నుంచి ఎమోషన్ వైపు..

బిగ్ బాస్ సీజ‌న్ 3 తొమ్మిదో వారం ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష‌గా మారింది. ఈ వారంలో టాస్క్‌లు గ‌త సీజ‌న్ మాదిరిగానే ఉండ‌డం, ఇంటి స‌భ్యులు తెగ జీవించ‌డం బోర్ తెప్పిస్తుంది. 60వ ఎపిసోడ్‌లో శివ‌జ్యోతి క‌న్నీటికి అడ్డుక‌ట్ట వేసే ప్ర‌య‌త్నం చేశారు బాబా భాస్క‌ర్ , రాహుల్‌, ర‌వి. మంగ‌ళ‌వారం ఎపిసోడ్‌లో బాబా భాస్క‌ర్ .. శివ‌జ్యోతిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్య‌లు చేయ‌డంతో వాటిని త‌ల‌చుకుంటూ తెగ ఏడ్చేసింది.

60వ ఎపిసోడ్‌లోను బిగ్ బాస్ కాలేజ్ హంగామా కొన‌సాగింది. బాబా భాస్క‌ర్ ల‌వ్వాల‌జీ క్లాసులు, వితికా గాస్సిపాల‌జీ క్లాసులు, వ‌రుణ్ సందేశ్ చిల్లాల‌జీ క్లాసులు చెప్పారు. అయితే బాబా భాస్క‌ర్, వితికా జ‌డ్జ్‌లుగా వ్య‌వ‌హ‌రించిన టాస్క్‌లో ఇంటి స‌భ్యులు రెండు జంటలుగా ఏర్ప‌డి ప్రేమాయ‌ణం న‌డిపించారు. వీరిలో హిమ‌జ‌, రాహుల్ జంట ప‌ర్‌ఫార్మెన్స్ జ‌డ్జెస్‌గా ఉన్న బాబా భాస్క‌ర్‌, వితికాల‌కి న‌చ్చ‌డంతో వారిని విజేత‌లుగా ప్ర‌క‌టించారు.

విజేత‌లుగా నిలిచిన రాహుల్‌, హిమ‌జ‌లు మ‌నోహ‌ర‌.. అనే పాట‌కి డ్యాన్స్ చేయ‌గా వారి ప‌ర్‌ఫార్మెన్స్‌ని ఇంటి స‌భ్యులు తెగ ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా వారిద్ద‌రు హ‌గ్‌లు చేసుకోవ‌డం, హిమ‌జ ఉరుక్కుంటూ వ‌చ్చి రాహుల్‌పైకి ఎక్క‌డం వంటివి చూస్తూ పున‌ర్న‌వి తెగ న‌వ్వుతూ ఎంజాయ్ చేసింది. బాబా భాస్క‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో సాగిన ప‌ర్‌ఫార్మెన్స్ ఈ ఎపిసోడ్‌లో కొంత బెట‌ర్ అని చెప్ప‌వ‌చ్చు. గడిచిన వారంగా చూస్తే బిగ్ బాస్ రొమాన్స్ తో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుందనే చెప్పాలి.

టీవీకి సంబంధించిన ప్రోగ్రాం కావడంతో ప్రేక్షకులు సైతం కాస్త అసహనానికి గురవుతున్నారు. ఇక నెటిజన్లు మాత్రం ప్రోమో లోనే ఎపిసోడ్ అంత చెప్పేస్తున్నారు. బిగ్ బాస్ ప్రోమోలో ఎన్ని ట్రిక్స్ ప్లే చేసిన ప్రోగ్రాం అంత ముందే చాటింగ్ ద్వారా నెటిజన్లు డిస్కస్ చెయ్యడం, అదే ప్రోగ్రాంలో రావడంతో బిగ్ బాస్ కూడా కాస్త జాగ్రత్త తీసుకుంటుందనే చెప్పాలి. నెటిజన్ల ఇంత అడ్వాన్స్ గా ఉండడం కూడా బిగ్ బాస్ కి తలనొప్పిగా మారిందనే చెప్పాలి. ఈసారి మాత్రం బిగ్ బాస్ రొమాన్స్ నుంచి ఎమోషన్ వైపు కాన్సంట్రేట్ చేసినట్లుగా తెలుస్తుంది.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

ల్యాండర్ విక్రమ్ ఫొటోలు తీసిన నాసా