in

తెలంగాణ పులికి పవన్ ఓకే చెప్తాడా

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్ష బాధ్యతలను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి దక్కడం కష్టంగానే కనిపిస్తుంది. పార్టీలోని అంతర్గత కలహాల మధ్య రోజులో చిచ్చు రాజుకుంటుంది. రేవంత్ కి పీసీసీ రాకుండా కాంగ్రెస్ పెద్దలే ఎంట్రీ అవ్వడంతో రేవంత్ కూడా చేసేది ఏమిలేక ప్రత్యామ్నాయ ఆలోచనలో పడ్డాడు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాను కలిసి రోజులు గడుస్తున్న ఎలాంటి కదలికలు కూడా కనిపించకపోవడంతో రేవంత్ డైలమాలో పడ్డట్టుగా తెలుస్తుంది.

తెలంగాణ టిడిపి పతనం అయిపోవడంతో తెలంగాణ కాంగ్రెస్ లో జాయిన్ అయిన రేవంత్ రెడ్డికి ఆ పార్టీ వాళ్లే శత్రువులుగా తయారైయ్యారు. రేవంత్ ప్రతి అక్టీవిటీస్ ని చాలా జాగ్రతగా పరిశీలిస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు. రీసెంట్ గా యురేనియం తవ్వకాలపై అఖిలపక్ష మీటింగ్ లోను టి కాంగ్రెస్ ఎవరికీ వారే అన్నట్టుగా నడుచుకున్నారు. దింతో టి కాంగ్రెస్ ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపించింది.

అయితే, ప్రస్తుతం ఒక వార్త చక్కర్లు కొడుతుంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి మధ్య జరిగిన సంభాషణ చూస్తుంటే తెలంగాణ జనసేన పార్టీ తరుపున రేవంత్ పోరాడుతానని చెప్పుకొచ్చినట్లుగా తెలుస్తుంది. దీనికి పవన్ కూడా పాసిటివ్ గా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏదిఏమైనా రేవంత్ రెడ్డి అధికారం కోసం చక్కర్లు కొడుతున్న వార్త ఎదో రూపంలో దర్శనం ఇస్తూనే ఉంది. ఐతే రేవంత్ అధికారం కోసం అధికారంలో ఉన్న బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వాలన్న లాజిక్ ఎందుకు మరచిపోతున్నాడని రేవంత్ అనుకూల వర్గాల నుంచి వస్తున్న మాట.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

ఏపీలో భారీగా బదిలీలు

వారు ఆశించింది వేరు.. మీరు ఇచ్చింది వేరు