in

భారీగా తగ్గిన బంగారం ధర

బంగారం ధరలు వరుసగా నాలుగో రోజు కూడా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు పుంజుకోవడం, బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి తగ్గించుకోవడం దీనికి కారణం. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర 0.04 శాతం తగ్గి రూ.37,670గా ఉంది.

గత నెలలో రూ.39,885కు పెరిగి రికార్డ్ స్థాయికి చేరుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.2,200 తగ్గింది. ఎంసీఎక్స్‌లో వెండి ధర రూ.0.04 శాతం తగ్గి రూ.46,626కు పడిపోయింది. వెండి గత నెలలో రికార్డ్ హై రూ.51,489 కు చేరుకున్న తర్వాత ఇప్పటి వరకు రూ.4900 పడిపోయింది.

బంగారం ర్యాలీకి కాస్త బ్రేక్ పడినప్పటికీ భవిష్యత్తలో మాత్రం పసిడి ధర పెరుగుతుందని భావిస్తున్నారు. ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుతో పెట్టుబడులు ఈక్విటీ మార్కెట్ల వైపు కదులుతున్నప్పటికీ అది దీర్ఘకాలికంగా మాత్రం కాదని అంటున్నారు. మరోసారి కుదుపులు వస్తే ఇన్వెస్టర్లు బంగారం వైపు చూస్తారని అంటున్నారు.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ₹ 35,830, 24 క్యారెట్ల బంగారం ₹ 39,020, కేరళ 22 క్యారెట్ల బంగారం ₹ 34,800, 24 క్యారెట్ల బంగారం ₹ 37,860, పూణేలో 22 క్యారెట్ల బంగారం ₹ 36,500, 24 క్యారెట్ల బంగారం ₹ 37,500, విజ‌య‌వాడ‌లో 22 క్యారెట్ల బంగారం ₹ 35,830, 24 క్యారెట్ల బంగారం ₹ 39,020, విశాఖలో 22 క్యారెట్ల బంగారం ₹ 35,830, 24 క్యారెట్ల బంగారం ₹ 39,020గా ఉంది.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

ఫ్లిప్ కార్ట్: భారీగా తగ్గిన రెడ్ మీ మొబైల్

ఛానళ్ల నిలిపివేత‌పై వివరణ ఇవ్వండి