in

బాబుకు మళ్ళీ నోటీసులు.. ఈసారి కాస్త గట్టిగా..

ఉండవల్లిలో తెదేపా అధినేత చంద్రబాబు అద్దెకు ఉంటున్న నివాసానికి సీఆర్ డీఏ అధికారులు మళ్లీ నోటీసులు అంటించారు. అంతేకాకుండా అక్రమ కట్టడాలను వారంలోగా తొలగించాలని, లేకపోతే తామే తొలగిస్తామని ఇంటి యజమాని లింగమనేని రమేష్ కు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు భవనం గోడకు సీఆర్ డీఏ అధికారులు నోటీసులు అంటించారు. వారం రోజుల్లోగా ఖాళీ చేయకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామంటూ నోటీసులు ఇచ్చింది

తాము గతంలో జారీ చేసిన నోటీసులకు కూడా సంతృప్తికర సమాధానం లేదని అందులో పేర్కొన్నారు. గతంలో కృష్ణానదికి భారీగా వరద ప్రవాహం ఉన్న సమయంలో కరకట్ట వెంట ఉన్న భవనాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో చంద్రబాబు నివాసానికి కూడా తాడేపల్లి తహసీల్దార్ శ్రీనివాస్ పేరుతో నోటీసులు జారీ అయ్యాయి. వరదల వల్ల ఇళ్లలోకి నీరు వచ్చే అవకాశమున్నందున సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అందులో కోరిన విషయం తెలిసిందే.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

జీఎస్టీ కీలక నిర్ణయాలు ఇవే…

ముస్తాబైన కెసిఆర్ బతుకమ్మ చీరలు.. ఈసారైనా మనసు దోచుకుంటారా!