in

ప్రేమను కాదంటారేమోనని ప్రేమజంట..

క్షణికావేశంలో పురుగుమందు తాగి ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అన్నారుపాడు గ్రామంలో చోటుచేసుకుంది ఇందుకు సంబంధించి కుటుంబ సభ్యులు గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి
అన్నారుపాడు గ్రామానికి చెందిన గూగులోత్ గోపీచంద్ (22) ఇదే గ్రామానికి చెందిన లావుడియా సింధు (21) వీరిద్దరు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.
వీరి ప్రేమను ఇరు కుటుంబాల వారు కాదంటారనే అనే భయంతో గత రాత్రి ఇంట్లో నుండి ఇద్దరు గ్రామం చివారులో ఉన్న పొలాల్లోకి వెళ్లి పురుగు మందు సేవించారు. ఈ విషయాన్ని ఇరు కుటుంబాల వారికి ఫోన్ చేసి మేము ఆత్మహత్య చేసుకుంటున్నామని తెలియజేసారు, తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు గ్రామస్తులు కలిసి పొలాల్లోకి వెళ్లి చూడగా ఇరువురు మృతిచెంది ఉన్నారు. ఇరు కుటుంబాల వారు మృతదేహాలను గ్రామానికి తీసుకు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గ్రామంలోకి చేరుకొని విచారణ నిర్వహించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

ముస్తాబైన కెసిఆర్ బతుకమ్మ చీరలు.. ఈసారైనా మనసు దోచుకుంటారా!

డాక్టర్ ‘నైన్టీ’ మాత్రమే తాగమన్నాడు