in

ఆస్కార్ లిస్ట్ లో విజయ్ దేవరకొండ సినిమా

విజయ్ దేవరకొండ నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమాకు అరుదైన అవకాశం లభించింది. 2019 సంవత్సరానికి గాను 29 భారతీయ సినిమాలకు ఆస్కార్ బరిలో నిలవగా అందులో డియర్ కామ్రేడ్ సినిమా ఒకటి కావడం విశేషం. భరత్ కమ్మ దర్శకత్వం లో వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందనే టాక్ వినిపించింది.

అయితే ఈ సినిమాలో నటించిన విజయ్ రష్మికలు మాత్రం ఈ సినిమా తమకు ఎంతో ప్రత్యేకం అని మొదటినుండి చెబుతున్నారు. తాజాగా వచ్చిన వార్తతో డియర్ కామ్రేడ్ టీమ్ సంబరాల్లో మునిగి తేలడం ఖాయంగా తెలుస్తుంది. అయితే కొందరు విశ్లేషకులు మాత్రం ఈ సినిమాలో ఆస్కార్ కి నామినేట్ అయ్యేంత ప్రత్యేకత ఏముందని పెదవి విరుస్తున్నారు.

డియర్ కామ్రేడ్ సాధారణ ప్రేమ కథే అయినా లిల్లీ పాత్రలో రష్మిక క్రికెటర్ గా కనిపించడం, మహిళా క్రీడల విభాగం లో ఆడవాళ్లకు ఎదురయ్యే ఆటంకాలు, మీటూ ఉద్యమం వంటివి జోడించి చూపించిన తీరుకు మాత్రం మహిళా ప్రేక్షకుల నుంచి సినిమా టీమ్ కు మంచి ప్రశంసలు దక్కాయి. ఏది ఏమైనా భారతీయ కథలు ఆస్కార్ బరిలో నిలవడం గర్వించదగ్గ విషయమే. అయితే డియర్ కామ్రేడ్ ఆస్కార్ కు నామినేట్ అవ్వడం పై విజయ్ దేవరకొండ, రష్మిక, దర్శకుడు భరత్ కమ్మ ఇంకా స్పందించాల్సి ఉంది.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

డాక్టర్ ‘నైన్టీ’ మాత్రమే తాగమన్నాడు

బదిలీ నిరసిస్తూ నిర్ణయం.. రాష్ట్రపతి ఆమోదం