in

బదిలీ నిరసిస్తూ నిర్ణయం.. రాష్ట్రపతి ఆమోదం

మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేయడాన్ని నిరసిస్తూ మద్రాస్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ విజయ కమలేష్‌ తహిల్‌ రమణి చేసిన రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదించారు. తన బదిలీని వ్యతిరేకిస్తూ ఈ నెల 6న రాజీనామానాను సమర్పించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా మద్రాస్‌ హైకోర్టు తాత్కాలిక చీఫ్‌గా, సీనియర్‌ జడ్జి వినీత్‌ కొఠారిని శనివారం రాష్ట్రపతి నియమించారు.

మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న అజయ్‌ కుమార్‌ మిట్టల్‌ను, మద్రాస్‌ హైకోర్టు ప్రధాన మూర్తిగా వ్యవహరిస్తున్న రమణి పదవులను తారుమారు చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం గత నెల 28న నిర్ణయం తీసుకుని, తన ప్రతిపాదనను రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. అయితే తన బదిలీని పునర్‌పరిశీలించాలంటూ రమణి సెప్టెంబర్‌ 2న కొలీజియానికి లేఖ రాశారు.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

ఆస్కార్ లిస్ట్ లో విజయ్ దేవరకొండ సినిమా

నలుగురు కొత్త న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం