in

పబ్లిసిటీ మీద ఉన్న శ్రద్ద.. నీటి మీద లేదు

యాభై రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టు నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుందని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు నీరు ఇంతవరకు ఒక్క బొట్టు కూడా వినియోగంలోకి రాలేదని మండిపడ్డారు. రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తి పోసే ప్రాజెక్టు కలిగి ఉండటంతో సుమారు వంద టీఎంసీల నీరు వృధాగా పోతుందన్నారు.

ఇప్పటి వరకు కేవలం 16 టీఎంసీల నీటిని మాత్రమే ఎత్తిపోశారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో రాష్ట్రానికి విద్యుత్ భారం అవుతుందన్నారు. రొల్లవాగు ఆధునీకరణకు టెండర్ ప్రక్రియ చేపట్టి మూడేళ్లు అవుతున్నా ఇంతవరకు పనులు ప్రారంభించలేదన్నారు. పబ్లిసిటీ మీద ఉన్న చిత్తశుద్ధి ప్రాజెక్టు నిర్మాణ పనుల మీద లేదని జీవన్‌రెడ్డి దుయ్యబట్టారు.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ‘సైరా’ సెగ

బిగ్ బాస్: ‘హిమజ’ అవుట్?