in

బిగ్ బాస్: ‘హిమజ’ అవుట్?

బిగ్ బాస్ సీజ‌న్ 3 కార్య‌క్ర‌మం స‌క్సెస్‌ఫుల్‌గా ఎనిమిది వారాలు పూర్తి చేసుకుంది. ఈ సోమవారంతో తొమ్మిదో వారం మొద‌లైంది. ఎనిమిదో వారం ఇంటి నుండి శిల్పా చ‌క్ర‌వ‌ర్తి ఎలిమినేట్ అయ్యింది. ఇప్పుడు ప్ర‌స్తుతం ప‌ది మంది ఇంటి స‌భ్యులు బిగ్ బాస్ ఇంట్లో ఉండ‌గా నామినేషన్‌లో రాహుల్‌ సిప్లిగంజ్‌, హిమజా, మహేశ్‌లు ఉన్నారు. 61 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో రేటింగ్‌లోను దూసుకెళుతుంది.

ప్ర‌స్తుతం తొమ్మిదో వారం కొన‌సాగుతుండ‌గా, ఈ వారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌నే దానిపై ఆస‌క్తిక‌ర చర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఈ వారం నామినేష‌న్‌లో రాహుల్‌, మ‌హేష్‌, హిమ‌జ ఉన్నారు. రాహుల్‌పై మొద‌ట కాస్త నెగెటివ్ ఓపీనియ‌న్ ఉన్న‌ప్ప‌పటికి ప్ర‌స్తుతం స్ట్రాంగ్‌గానే ఉన్నాడు. దీంతో ఇత‌ను ఈ వారం సేఫ్ అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. హిమ‌జ‌, మ‌హేష్‌ల‌ని పోల్చి చూస్తే ప్రేక్ష‌కుల‌లో మ‌హేష్‌పై సాఫ్ట్ కార్న‌ర్ ఉన్న‌ట్టుగా అర్ధ‌మ‌వుతుంది. దీంతో అత‌ను కూడా సేఫ్ అయ్యే అవ‌కాశాలే ఎక్కువ‌. హిమ‌జ‌పై ఇంటి స‌భ్యుల‌లో కాస్త వ్య‌తిరేక‌త ఉండ‌డంతో పాటు ఒక్కోసారి త‌న ప్ర‌వ‌ర్త‌న ప్రేక్ష‌కుల‌కి కూడా కాస్త చిరాకు క‌లిగించింద‌నే టాక్ వినిపిస్తుంది. ఏదైన అద్భుతం జ‌రిగితే త‌ప్ప హిమ‌జ సేఫ్ అయ్యి మ‌హేష్ బ‌య‌ట‌కి వెళ‌తాడు.

కొంతమంది తమ అభిప్రాయాలను సోషల్‌ మీడియాలో వెల్లడిస్తున్నారు. ప్రోమో చూసిన వారెవరికైనా.. రాహుల్‌ ఎలిమినేట్‌ అయినట్టు ఇట్టే తెలిసిపోతుంది. అయితే అంత ఈజీగా తెలిసిపోయేలా ప్రోమోను విడుదల చేశాడంటే.. అందులో ఏదో తిరకాసు ఉందంటున్నారు నెటిజన్లు. రాహుల్‌ను ఎలిమినేట్‌ చేయలేదు.. సీక్రెట్‌ రూమ్‌లోకి పంపించారంటూ ఓ ప్రచారం జరుగుతోంది.

మరోవైపు హిమజ ఎలిమినేట్‌ అయిపోందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్న హిమజ ఫాలోవర్స్‌.. బిగ్‌బాస్‌పై మండిపడుతున్నారు. పనికి రానివాళ్లంతా షోలో ఉన్నారు.. హిమజ లేకపోతే టీఆర్పీలు కూడా రావంటూ.. ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగా హిమజ ఎలిమినేట్‌ అయిందా? రాహుల్‌ను ఎక్కడికి పంపించారు? అనే విషయాలు తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే!

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

పబ్లిసిటీ మీద ఉన్న శ్రద్ద.. నీటి మీద లేదు

ఆన్ లైన్లో సినిమా టికెట్లు బంద్…