in

మంత్రిగా వస్తున్న మాజీ ఎంపీ శివ‌ప్ర‌సాద్

శివ‌ప్ర‌సాద్ రాజ‌కీయ నాయ‌కుడిగా కంటే ఆయ‌న గొప్ప న‌టుడిగానే తెలుగువారికి బాగా ప‌రిచయం. న‌ట‌నంటే ఆయ‌న‌కు ప్రాణం. నాట‌క‌రంగం నుంచి సినిమాల్లో ప్ర‌వేశించిన అతి త‌క్కువ మంది న‌టుల్లో ఆయ‌న ఒక‌రు. 1980లో తెలుగుతెర‌కు ప‌రిచ‌య‌మైన ఆయ‌న ప‌లు చిత్రాల్లో న‌టించారు.

చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో మంత్రిగా చేరిన త‌రువాత కూడా ఆయ‌న న‌ట‌న మానుకోలేదు. కాక‌పోతే.. అప్ప‌టి నుంచి ఆయ‌న పారితోషికం తీసుకోవ‌డం మానేసారు. ఉచితంగానే సినిమాలు చేస్తున్నారు. ఆటాడిస్తా, డేంజ‌ర్‌, పిల్ల‌జమీందార్‌, ద్రోణా, మ‌స్కా, దూసుకెళ్తాలో ఆయ‌న ప్ర‌తినాయ‌క‌, హాస్య పాత్ర‌ల్లో మెప్పించారు. ఆయ‌న న‌టించిన ఆఖ‌రి చిత్రం సాఫ్ట్‌వేర్ సుధీర్. ఈ సినిమాలో ఆయ‌న మంత్రిగా క‌నిపించ‌నున్నారు. త్వ‌ర‌లోనే విడుద‌ల కానున్న ఈ సినిమాలో శివ‌ప్ర‌సాద్ మంత్రిగా క‌నిపించ‌నున్నారు. అంటే భౌతికంగా ఆయ‌న మ‌న‌కు దూర‌మైనా..మ‌రోసారి మంత్రి పాత్ర‌లో జ‌న్మించ‌నున్నాడ‌ని ఆయ‌న అభిమానులు అంటున్నారు.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

హుజూర్‌న‌గ‌ర్‌: బయల్దేరిన కారు.. గెలుపు ప్రయత్నాలు షురూ

సైరా పై TV9 రచ్చ, కారణం అదేనా