in

నా చర్మం ఒలిచి.. మీకు చెప్పులు కుట్టించిన తక్కువే

‘సైరా’ చిత్రంలో మాధవయ్యర్‌ క్యారెక్టర్‌ చేయడం తన పూర్వజన్మ సుకృతం భావిస్తున్నానని, సినీనటుడు, ఎస్వీబీసీ చైర్మన్‌ పృధ్వీరాజ్‌ తెలిపారు. తన సినీ జీవితంలో ఈ క్యారెక్టర్‌ ఒక్కటి చాలని, ఇంకా సినిమాలు చేయకపోయినా పరవాలేదని ఆయన ఉద్వేగంగా అన్నారు.

హైదరాబాద్‌లో నిర్వహించిన సైరా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో పృధ్వీరాజ్‌ మాట్లాడుతూ…. సినిమా ఇంటర్వెల్‌ బ్లాక్‌లో ‘అన్నయ్య’ గొప్పదనం గురించి చెప్పేటప్పుడు మాధవయ్యార్‌ సునామీలా విరుచుకుపడతాడు. ఇంత మంచి క్యారెక్టర్‌ నాకు ఇచ్చినందుకు అన్నయ్యకు జీవితాంతం రుణపడి ఉంటా. నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా ఆయన రుణం తీర్చుకోలేను. ఈ చిత్రం మెగా అభిమానులకు ఫుల్‌ జోష్‌. సినిమా అన్ని భాషల్లో సూపర్‌, డూపర్‌ హిట్‌ అవుతుంది. రికార్డులు బద్దలు కొట్టడానికి కొణెదల సింహం వస్తున్నాడు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు సురేందర్‌ రెడ్డి, పరుచూరి బ్రదర్స్‌కు నా కృతజ్ఞతలు’ అని తెలిపారు.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

టీనేజర్స్ ను వేధిస్తున్న ఆ సమస్య

మొదలైన కూల్చివేత.. ‘బాబు నివాసం’ లక్ష్యంగా ముందుకు..