in

దసరా దొంగలు వస్తున్నారు జాగ్రత్త.. మూడు ఇళ్లల్లో చోరీ

మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక హిల్స్ ఫేస్-11 కాలనీలో మూడు ఇళ్లల్లో చోరీ జరిగింది. కాలనీలోని ఓ ఇంట్లో 14వేల రూపాయల నగదు, 13 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లిన దొంగలు, మరో రెండు ఇళ్లల్లో 2 సెల్‌ఫోన్స్ చోరీ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ మధ్య దొంగలు ఆగడాలు ఎక్కువయ్యాయనీ, వాళ్లను ఖచ్చితంగా పట్టుకొని కటకటాల వెనకకు నెడతామని పోలీసులు తెలిపారు.

దసరా సీజన్ వస్తుండడంతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇంటి నుంచి పండగకు ఊళ్లోకి వెళ్లే ముందు ఇంట్లో విలువైన వాటిని ఉంచకపోవడమే మంచిదని చెప్పుతున్నారు. వరుస సంఘటనలు జరుగుతుండడం, సీసీ కెమెరాలో పడకుండా దొంగ ముఠాలు జాగ్రత్త పడడం పోలీసులకు సవాలుగా మారాయి.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

మొదలైన కూల్చివేత.. ‘బాబు నివాసం’ లక్ష్యంగా ముందుకు..

వీడియో: అమెరికా సభలో తెలుగులో మాట్లాడిన ప్రధాని మోదీ