in

ఆమెకు క్షమాపణలు చెప్పిన మోదీ

అమెరికాలోని హూస్టన్ వేదికగా జరిగిన ‘‘హౌడీ మోదీ’’ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సెనేటర్‌ జాన్‌ కార్నీ సతీమణి శాండీకి ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పారు. ఈ సభకు హాజరైన సెనెటర్ జాన్ కార్నిన్ భార్య అసూయగా ఉండి ఉంటారని, అందుకు ఆమెకు క్షమాపణలు చెబుతున్నానని మోదీ అన్నారు. ఆదివారం జాన్ కార్నిన్ భార్య శాండీ పుట్టినరోజు. అలాంటి ప్రత్యేకమైన రోజున జాన్తన భార్యతో సమయం గడపకుండా తనతో ఉండటంతో మోదీ ఆమెను క్షమాపణ కోరారు. అనంతరం జాన్ కార్నిన్ భార్య శాండీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ మాట్లాడుతుండగా పక్కనే ఉన్న జాన్ కార్నిన్ చిరునవ్వులు చిందించారు.

దీని తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రజల మనసును గెలవడం ఎలాగో మోదీకి తెలుసంటూ నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

సినీ ఆరంగేట్రం చేయనున్న జబర్దస్త్ కూతురు

రూ.20 లక్షలు నష్టపరిహారం.. రూ.15 లక్షలు ఇన్సూరెన్స్.. ఒకరికి ఉద్యోగం