in

కేంద్రంపై ఒత్తిడి తెద్దాం.. పార్లమెంటులో వ్యవహరించే తీరుపై చర్చ

తెలుగు రాష్ట్రాలకు సాధ్యమైనంత ఎక్కువ నిధులను రాబట్టుకోవడానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌లు నిర్ణయించినట్లు సమాచారం. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ఇరువురు నేతలు సమావేశమైనారు.

దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో గోదావరి, కృష్ణా అనుసంధానంతో పాటు అనేక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం మేరకు కేంద్రంలోని నరేంద్రమోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలతో వ్యవహరిస్తున్న తీరుపై ఇరువురి నేతల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.

సర్దుకుపోయే ధోరణితో వ్యవహరిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుండి సహాయ నిరాకరణే ఎదురవుతోందని, నిధులు విడుదల చేయకపోవడంతో పాటు రెండు పార్టీలకు చెందిన ఎంపీలను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైనట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో పూర్తిస్థాయిలో ఎదురుతిరిగినట్టు కాకపోయి నప్పటికీ, కేంద్రంపై ఒత్తిడి పెంచాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. దీనిలో భాగంగా పార్లమెంటులో వ్యవహరించే తీరుపై ఉమ్మడి కార్యాచరణను రూపొందించుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.

తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై వైసిపి,టిఆర్‌ఎస్‌ సభ్యులు ఉమ్మడిగా పట్టుబడితే కేంద్రం దిగివచ్చే అవకాశం ఉందని భావించినట్లు తెలిసింది. కీలకమైన గోదావరి, కృష్టా నదుల అనుసంధానం విషయంలో తుది నిర్ణయం తీసుకోవడానికి మరోమారు సమావేశం కావాలని నిర్ణయించారు.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

అద్దం ప్రతిబింబంలో.. స్వీటెస్ట్ మామయ్య

మీకు విలువలు, విశ్వసనీయత ఉంటే.. ‘లీక్’ వీరుల్ని పట్టుకోండి