in

వేణుమాధవ్ పరిస్థితి విషమం

వెండితెర హాస్యనటుడు వేణుమాధవ్ పరిస్థితి అత్యంత విషమంగా మారింది. గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న వేణుమాధవ్‌ ప్రస్తుతం సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి తోడు కిడ్నీ సమస్యలు కూడా తలెత్తడంతో ప్రస్తుతం వెంటిలెటర్‌ సాయంతో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు.

కమెడియన్‌గా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన వేణు మాధవ్‌, తెలుగు సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. మిమిక్రీ, వేణుమాధవ్‌కి వెన్నతో పెట్టిన విద్య. ఆ మిమిక్రీ కళని నటనకు జోడించి, వేణుమాధవ్‌ అవకాశాల్ని దక్కించుకోవడమే కాదు, విజయాల్ని కూడా అందుకున్నారు.

స్టార్‌ కమెడియన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న దశలో, హీరోగానూ అవకాశాలు రావడంతో, అటు వైపూ అడుగులు వేశారు. నిర్మాతగానూ ఒకటి రెండు సినిమాలు నిర్మించి, నష్టపోయారు వేణుమాధవ్‌. సినిమాలే కాదు, రాజకీయాల్లోనూ వేణుమాధవ్‌ పేరు ఒకప్పుడు గట్టిగానే విన్పించింది. తెలుగుదేశం పార్టీకి ఆయన అత్యంత సన్నిహితుడు. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా టీడీపీ తరఫున ప్రచారం కూడా చేశారు.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

లైలా సెకండ్ ఇన్నింగ్స్

ఎల్బీస్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ వరకు..