in

డీమెరిట్ లిస్ట్ లో కోహ్లీ.. సస్పెన్షన్ వేటు?

విరాట్ కోహ్లీ.. అంటేనే దూకుడైన ప్రవర్తన..! ఇటీవలి కాలంలో కాస్త తగ్గించాడు అని అనుకుంటున్నారు.. కానీ సౌత్ ఆఫ్రికాతో బెంగళూరులో జరిగిన టీ20లో మరోసారి పూర్వపు కోహ్లీని మనకు చూపించాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ బ్యాట్ ఝుళిపించడానికి దక్షిణాఫ్రికా బౌలర్లు అసలు ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో కోహ్లీ కయ్యానికి కాలుదువ్వాడు. బ్యూరాన్ హెండ్రిక్స్ ను కావాలనే ఢీకొట్టాడు కోహ్లీ. ఆ సమయంలో ఒకింత షాక్ అయ్యాడు బ్యూరాన్ హెండ్రిక్స్. నా తప్పేమీ లేకున్నా కూడా కోహ్లీ ఇలా చేశాడేంటబ్బా అన్న ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు బ్యూరాన్ హెండ్రిక్స్.


ఈ ఘటనపై కోహ్లీ కూడా తన తప్పును ఒప్పుకున్నాడు. దీంతో మ్యాచ్ రిఫరీ కోహ్లీని మందలించాడు. ఇది ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ లెవల్ 1 తప్పిదం కావడంతో కోహ్లీ ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ చేరింది. కోహ్లీకి ఇప్పటికే రెండు డీమెరిట్ పాయింట్లున్నాయి.

రెండేళ్ల వ్యవధిలో ఓ క్రికెటర్ ఖాతాలో నాలుగు డీమెరిట్ పాయింట్లు చేరితే ఓ సస్పెన్షన్ పాయింటుగా మారుతుంది. రెండు సస్పెన్షన్ పాయింట్లు ఉన్న ఆటగాన్ని ఓ టెస్టు కానీ, రెండు వన్డేలు కానీ, రెండు టి20 మ్యాచ్ లు ఆడకుండా చేయొచ్చు. కాబట్టి కోహ్లీ కాస్త జాగ్రత్త పడితే బాగుంటుంది.. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ త్వరలోనే రాబోతోంది.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

పాక్ లో భూకంపం

అగ్ర హీరోలకు ఛాలెంజ్ విసిరిన రకుల్