in

అమృతకు ఆగని వేధింపులు.. మళ్ళీ పెళ్లి చేసుకో..

కుల వివక్షతో ప్రణయ్ దారుణహత్యకు గురైనా అతని భార్య అమృత, కుటుంబసభ్యులకు వేధింపులు మాత్రం తప్పడం లేదు. అయితే ప్రణయ్ చనిపోయి ఈనెల 11కు ఏడాది పూర్తవుతుంది. ఇప్పటికీ అమృతకు బెదిరింపులు తగ్గడం లేదని తెలిసింది. ఆమెకు ఫోన్ చేసి కొందరు.. బయట కనిపించిన వాళ్లు – మారుతీరావు అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నట్టు ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తాజాగా అమృత కుటుంబ సభ్యులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ బైక్ వచ్చిన ఆగంతకుడు అమృత ఇంటికి ఓ లేఖ అంటించి వెళ్లాడు. అది చూసి అమృత కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు.

‘నీ చనిపోయిన భర్త ప్రణయ్ ను వెంటనే మరిచిపోవాలని.. వెంటనే ఆ ఇల్లు ఖాళీ చేసి బయటకు రావాలని.. సతీష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని..’ సతీష్ ఫొటోను లేఖతోపాటు అంటించి ఆగంతకుడు వెళ్లిపోయాడు. దీంతో అమృత మంగళవారం ఈ లేఖపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా అమృతను బెదిరించిన వ్యక్తిని కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. బెయిల్ పై విడుదలైన తన తండ్రి మారుతీరావే ఇలా కొందరితో బెదిరింపులకు పాల్పడుతున్నాడని అమృత ఆరోపించింది.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

యూట్యూబ్ లో ‘ఇస్మార్ట్’ వ్యూస్

బాధ్యతలకు తగ్గ పదవి ఇవ్వనున్న జగన్