in

బాధ్యతలకు తగ్గ పదవి ఇవ్వనున్న జగన్

ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడానికి జగన్ ఎంతగా శ్రమించారో, ఎన్ని సవాళ్లు ఎదుర్కున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జైలు జీవితం గడిపిన జగన్ మోహన్ రెడ్డి రాజకీయ పోరాటంలో చివరికి విజయం సాధించారు. ఎవరూ ఊహించని విధంగా అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే జగన్ రెడ్డిని జైలుకి పంపితే ఇక వైసీపీ పని ఖాళీనే అనుకున్న సమయంలో తండ్రి ఆశయాలు, అన్నకి జరిగిన అన్యాయాన్ని, తమ కుటుంభానికి జరిగిన అవమానాల్ని ప్రజలకి తెలియజేస్తూ అన్న మీకోసం మళ్ళీ వస్తాడు అంటూ వైసీపీ భాద్యతలని భుజాన మోసి పాదయాత్ర చేస్తూ, వాడైన మాటలతో అన్న వదిలిన బాణాన్ని అంటూ ప్రజల్లోకి వెళ్ళిన షర్మిల సేవలు అనిర్వచనీయం అనే చెప్పాలి.

షర్మిల నడుం కట్టుకుని చేసిన పాదయాత్ర ఎవరూ ఊహించని విధంగా సక్సెస్ అయ్యింది. వైసీపీ అధికారంలోకి రావడానికి ఆమె చేసిన ప్రచారాలు, చంద్రబాబు లోకేష్ లపై చేసిన పదునైన వ్యాఖ్యలు కూడా ఒక కారణమే. అయితే పార్టీ కోసం అహర్నిశలు పని చేసిన వారికి జగన్ మోహన్ రెడ్డి పదవులు కట్టబెట్టారు. కనీ షర్మిలకి మాత్రం ఎటువంటి పదవులు ఇవ్వలేదు అనుకున్న సమయంలో విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం త్వరలోనే షర్మిలకి కీలక పదవిని కట్టబెట్టనున్నారని తెలుస్తోంది.

ప్రభుత్వ పనులతో జగన్ బిజీగా ఉన్నారు. కొత్త పథకాలు ప్రవేశపెడుతూ రాష్ట్రాన్ని సంక్షేమం దిశగా నడిపిస్తున్నారు. ఇటు పార్టీ అధ్యక్షుడిగా, అటు సీఎంగా తీరిక లేకుండా పనిచేస్తున్నారు. దీంతో.. పార్టీ వ్యవహారాలు చూసే బాధ్యత తన సోదరికి అప్పజెప్పేందుకు సీఎం జగన్ రెడీ అవుతున్నట్లు సమాచారం.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

అమృతకు ఆగని వేధింపులు.. మళ్ళీ పెళ్లి చేసుకో..

తెర‌ప‌డిన‌ వార‌సుల ఆందోళ‌న‌.. ఇక తెరపై ‘సై’రా..