in

నిద్రపోతున్న సైరా టీం, PR అవతారం ఎత్తిన అభిమాని

రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్ లో చిరంజీవి నటించిన సైరా నరసింహ రెడ్డి వచ్చేనెల అంటే అక్టోబర్ 2 వ తారీఖున రిలీజుకు సిద్దమవుతుంది. అయితే ఒక వైపు ఈ సినిమాపై ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి వంశస్తులు రాయల్టీ కోసం కేసులు వేసి నిర్మాతలను ఇరకాటంలో పెడితే, ఇంకో వైపు అస్సలు సినిమాని ప్రమోట్ చెయ్యట్లేదు సరిగ్గా అని అభిమానులు కస్సుమంటున్నారు సోషల్ మీడియా లో.

ఇప్పటి వరకు తమ అభిమాన హీరోల సినిమాలు రిలీజు అయితే కటౌట్లు కట్టి పాలాభిషేఖం చేసి రక్తదానాలు చేసిన అభిమానులను మాత్రమే చూసారు కానీ, ఏకంగా తన అభిమాన హీరో సినిమాని నిర్మాతలు సరిగ్గా ప్రమోట్ చేయట్లేదని తానే విషయం కనుక్కుందామని ముంబై వెళ్ళాడు ఒక అభిమాని.

@NrOpines అనే ట్విట్టర్ యూజర్ చిరంజీవికి వీరాభిమాని, సైరా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. అయితే రామ్ చరణ్ నిర్మాతగా ఫెయిల్ అయ్యాడని, సినిమాని సరిగ్గా ప్రమోట్ చేయట్లేదని భావించి, ఏకంగా ముంబై వెళ్లి ఆ సినిమాని హిందీ లో రిలీజ్ చేస్తున్న ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ సామ్,సంస్థ దగ్గరికే వెళ్లి కూర్చున్నాడు. ఇదంతా తాను చెపితే కొందరు హేళన చేసారు. అయినా సరే నిర్భయంగా అక్కడికి వెళ్లి, అక్కడి నుండి ఫోటోలను కూడా షేర్ చేసాడు మనోడు.

ఇతనిలో ఉన్న కసి లో కాస్తయినా ఆ సినిమా నిర్మాతలకు కానీ టీం కి కానీ ఉంది ఉంటె ఎప్పుడో బజ్ ఒచ్చేది సైరా పై.

రాజమౌళి సినిమాలు ఊరికే హైప్ రావు. అన్నింటిలో రాజమౌళి ని ఫాలో అయ్యే తెలుగు నిర్మాతలు ఈ సినిమాలను ప్రమోట్ చేసే విషయం లో మాత్రం ఫెయిల్ అవుతున్నారు.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

ఇది నిజం.. వేణుమాధవ్ ఇక లేరు

గాడితప్పుతున్న మీడియా.. గాడిలోపెడుతున్న సోషల్ మీడియా