in

మీరు రండి, మై హోనా

భారత్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని అమెరికా పారిశ్రామిక వర్గాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విఙ్ఞప్తి చేశారు. న్యూయార్క్‌లో జరిగిన బ్లూమ్‌బర్గ్‌ గ్లోబల్‌ బిజినెస్‌ ఫోరం సదస్సులో పాల్గొంటూ పెట్టుబడులకు భారత్‌ అనుకూల దేశమని.. భారత్‌తో వాణిజ్య, వ్యాపారాల్లో భాగస్వామ్యం కావడం సువర్ణ అవకాశమని పేర్కొన్నారు.

‘మీ కలలు, ఆశయాలకు భారత్‌ గమ్యస్థానం. మీ సాంకేతికతకు మా ప్రతిభను జోడిస్తే ప్రపంచాన్ని మార్చవచ్చు. మీ మెళకువలు- మా నైపుణ్యాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తాయి. వీటన్నింటికీ నేను వారధిగా ఉంటాను’ అని మోదీ పిలుపునిచ్చారు.    ‘మేక్ ఇన్ ఇండియా’ అనేది ఇటు భారత్ కు, అటు ప్రపంచానికి కూడా ఉపయుక్తంగా ఉంటుందని, అందుకు అనుగుణంగా బిజినెస్ లీడర్లను భారత్ కు ఆహ్వానిస్తున్నామని ప్రధాని తెలిపారు. 

భారత్‌లో కార్పొరేట్‌ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మక అడుగు అని తెలిపారు. దేశ ప్రగతికి ఆటంకాలు కలిగించే 50 చట్టాలకు స్వస్తి పలికామని పేర్కొన్నారు. అదే విధంగా గత ఐదేళ్లలో ఎన్నెన్నో సంస్కరణలు ప్రవేశపెట్టామని మోదీ తెలిపారు. పేదరికాన్ని నిర్మూలించే దిశగా కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. రోడ్లు, ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.

మా ప్రజాస్వామ్య విలువలు, న్యాయ వ్యవస్థ మీ పెట్టుబడులకు భద్రతనిస్తాయి. ఇంజనీరింగ్‌, పరిశోధన- అభివృద్ధిలో భారత ప్రజలు అత్యంత ప్రతిభ కనబరుస్తూ ముందుకు సాగుతున్నారని చెప్పారు. `మౌలిక వసతుల కల్పన, దేశ రక్షణకు మేము అత్యంత ప్రాధాన్యం ఇస్తాం. అన్ని రంగాల్లోనూ పారదర్శక విధానాలు అవలంబిస్తాం. భారత్‌లో పెట్టుబడులకు ఇదే అనుకూల సమయం’ అని మోదీ తెలిపారు. 

పెద్ద మార్కెట్‌లో పెట్టుబ‌డి పెట్టాల‌నుకుంటే భారత్ కు రావాలంటూ ఆయ‌న ఆహ్వానించారు. ఆధునిక మౌళిక స‌దుపాయాల క‌ల్ప‌న కోసం త‌మ ప్ర‌భుత్వం 1.3 ట్రిలియ‌న్ డాల‌ర్లు ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్లు చెప్పారు. `స్నేహితులారా, మీ ఆలోచ‌న‌లు, మా స్వ‌ప్నాలు ఒకే విధంగా ఉన్నాయి. మీ టెక్నాల‌జీ, మా ట్యాలెంట్ ఈ ప్ర‌పంచాన్ని మార్చేస్తుంది’ అని మోదీ తెలిపారు. మీ పెట్టుబ‌డులు, మా నైపుణ్యం ప్ర‌పంచ ఆర్థిక వృద్ధిని ఉర‌క‌లు పెట్టిస్తాయి’ అని పేర్కొన్నారు. 

ప్రపంచంలోనే బొగ్గు నిల్వల్లో మూడో పెద్ద దేశంగా భారత్ నిలుస్తోందని, కోల్ గ్యాసిఫికేషన్ కోసం ప్రపంచదేశాలను తాము ఆహ్వానిస్తున్నామని మోదీ పిలుపిచ్చారు. కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా శుద్ధమైన ఇంధనం తయారవుతుందని తెలిపారు. ఇదొక ఇంధన వనరుగా అందరికీ ఎంతో ఉపయుక్తమవుతుందని చెప్పారు. తమ దేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నామని, ఈ దిశంగా అక్టోబర్ 2న మహాత్మాగాంధీ జయంత్యుత్సవం రోజున దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నామని చెప్పారు.  

డెమోక్ర‌సీ, డెమోగ్ర‌ఫీ, డిమాండ్‌, డిసైసివ్‌నెస్‌తో భార‌త్ ముందుకు వెళ్తోంద‌ని ప్రధాని తెలిపారు. 5 ట్రిలియ‌న్ ఆర్థ‌క వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయాల‌ని ల‌క్ష్యం పెట్టుకున్నామని చెబుతూ ఆ దిశ‌గా అనుకూల ప‌రిస్థితుల్ని క్రియేట్ చేస్తున్నామ‌ని చెప్పారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను భారత్ నిషేధించింద‌ని గుర్తు చేశారు. 

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

‘సరిలేరు.. నీకెవ్వరు’

జగన్ Vs కేంద్రం : మళ్ళీ మొదటికొచ్చిన యవ్వారం