in

‘అన్నదాత సుఖీభవ’ సమాప్తం

రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు టీడీపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో ప్రవేశపెట్టిన రుణమాఫీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో రైతులకు దాదాపు రూ.7,959 కోట్ల మేర చెల్లింపులు నిలిచిపోయాయి. రైతు రుణ మాఫీ పథకాన్ని గత ప్రభుత్వం ప్రవేశపెట్టి 3 విడతలుగా రుణ మాఫీ చేసింది. 4, 5 కిస్తీల కింద రుణమాఫీ చేసే సమయంలో ఎన్నికలు వచ్చాయి. రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో ఈ పథకాన్ని రద్దు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. 4, 5 విడతల్లో చెల్లించాల్సిన మొత్తం నిలిపివేస్తూ వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు.

రెండు విడతల్లో చెల్లించాల్సిన మొత్తానికి 10 శాతం వడ్డీ కలిపి చెల్లించేందుకు వీలుగా గత ఏడాది మార్చి 10న జారీ చేసిన ఉత్తర్వును రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 15 నుంచి ‘రైతు భరోసా’ పథకం అమలు చేయనున్న నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ కావడం గమనార్హం.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

‘అందాల నిధి’ దాచుకోలేకపోతున్న నిధి అగర్వాల్

విషజ్వరాల వ్యాధి తీవ్రత వేరు.. ప్రభుత్వ గణాంకాలు వేరు