in

రామగుండం ఎరువుల కర్మాగారం: అన్నివిధాలా సహకరిస్తాం

రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ, కార్యకలాపాల ప్రారంభం కోసం అన్నివిధాలా సహకరిస్తామని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ హామీ ఇచ్చారు. కంపెనీ పునరుద్ధరణ పనులపై మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్, రామగుండం ఎమ్మెల్యే చందర్, పరిశ్రమల శాఖ అధికారులు, కంపెనీ ప్రతినిధులతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు.

కంపెనీ పున:ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్న కేటీఆర్​… అన్నివిధాలా సహాయ సహాకారాలు అందిస్తామని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు కంపెనీ పునరుద్దరణకు కృషి చేశామన్న మంత్రి… రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష భాగసామ్యం కూడా తీసుకుందని పేర్కొన్నారు.

కంపెనీ ఉద్యోగాల్లో స్థానికులకు వీలైనంత వరకు అవకాశాలు ఇవ్వాలని మంత్రి కేటీఆర్​ కోరారు. కంపెనీ అవసరాలకు అనుగుణంగా టాస్క్ ద్వారా ప్రభుత్వ ఖర్చుతో యువతకు శిక్షణ ఇప్పిస్తామని… వారిలో నుంచి ఉద్యోగులను ఎంపిక చేసుకోవాలని కేటీఆర్ ప్రతిపాదించారు. ఈ మేరకు రామగుండం ఎరువుల కర్మగారంతో కలిసి పనిచేయాలని టాస్క్ ప్రతినిధులను మంత్రి అదేశించారు.

కంపెనీ రవాణా అవసరాలు, హమాలీ వంటి అవసరాలకు పరిసర ప్రాంతాల్లోని ప్రజల సేవలు ఉపయోగించుకోవాలని మంత్రులు కోరారు. కంపెనీ పరిసరాల్లో గతంలో ఉన్న కేంద్రీయ విద్యాలయాన్ని తిరిగి ప్రారంభించాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. ఈ విషయమై కేంద్ర మానవనరుల అభివృద్ధి శాఖ మంత్రికి లేఖ రాస్తానని మంత్రి కేటీఆర్ తెలిపారు.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

ఇండోనేషియాలో భారీ భూకంపం

స్వరూపం మారబోతున్న టెన్త్ ప్రశ్నపత్రం