in

సెన్సార్ సై.. హైకోర్ట్ నై?

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నర్సింహరెడ్డి చిత్రం విడుదలకు ముందే సెన్సేషనల్ క్రియేట్ చేస్తున్నది. ఇప్పటికే ఎన్నో ప్రత్యేకతలతో ప్రేక్షకుల్లోను, అలాగే ట్రేడ్ వర్గాల్లోనూ అంచనాలు పెంచింది. తాజాగా సెప్టెంబర్ 22న ప్రీ రిలీజ్ జరుపుకొన్న ఈ చిత్రం సెన్సార్ పనులను కూడా పూర్తి చేసుకొన్నది. ఈ సినిమా సెన్సార్ రిపోర్టు ఏమిటంటే..

సైరా మూవీకి సంబంధించిన సెన్సార్ పనులు సెప్టెంబర్ 23న పూర్తయ్యాయి. ఈ సినిమాపై పూర్తిస్థాయిలో సంతృప్తిని అధికారులు వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ అందించారు. దాంతో ఈ సినిమా రిలీజ్ లైన్ క్లియర్ అయింది.సైరా మూవీ వీక్షించిన అధికారులు చిత్ర యూనిట్‌ను ప్రశంసించినట్టు తెలిసింది. క్లీన్‌గా ఉండటంతో ఒక్క కట్ లేకుండా సినిమాకు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చినట్టు సమాచారం. ఇక ఈ సినిమా నిడివి 2.44 నిమిషాలు అని సెన్సార్ రిపోర్టు పేర్కొన్నది. సెన్సార్ అధికారుల నుంచి సానుకూలమైన స్పందన రావడంతో చిత్ర యూనిట్ కాన్ఫిడెన్స్ మరింత పెరిగినట్టు తెలిసింది.

నిన్నటి వరకు క్లియర్ గా ఉన్న సైరా సినిమా, ఎలాంటి ఆటంకాలు లేకుండా రిలీజ్ అవుతుంది అనుకున్న సైరా పై ఇప్పుడు అంతా కన్ఫ్యూషనే. అసలు ఈ సినిమా ప్రచారంలో చెప్పింది నిజామా?, లేక కోర్ట్‌కి చెప్పింది నిజామా?, అసలు సెన్సార్ బోర్డు సభ్యులు ఏం మాట్లాడుతున్నారు?, సినిమా టీమ్ ఏం ప్రచారం చేస్తున్నారు?..ఇలా అంతా కూడా ఒక పజిల్‌లా ఉంది. ఈ కేసుపై విచారణ సోమవారానికి వాయిదా పడడంతో బుధవారం ఈ సినిమా రిలీజ్ అనేది కూడ ఇప్పుడు కాస్త అనుమానంగానే ఉంది. ఈ కన్ఫ్యూషన్ అంతా ఎప్పటికి క్లియర్ అవుతుంది?…సైరా ఎలా రిలీజ్ అవుతుంది అనేది చూడాలి.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

హెలికాఫ్టర్ ల్యాండింగ్ అధికారులకు నోటీసులు

పవన్ కు దూరంగా జేడీ.. కారణం ఎవరు?