in

రెండు రోజుల్లో గ్రామ వాలంటీర్ల జీతాలు

రాష్ట్రంలో గ్రామ వాలంటీర్ల బ్యాంకు ఖాతాల్లో అక్టోబర్‌ ఒకటో తేదీన గౌరవ వేతనం జమ చేయనున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ లో మొత్తం 1,92,848 మంది గ్రామ వాలంటీర్లకుగాను 1,85,525 మంది నియామక ప్రక్రియ పూర్తయిందని.. అందులో 1,50,661 మందికి గౌరవ వేతన చెల్లింపులకు జిల్లాల నుంచి ప్రతిపాదనలు అందినట్టు పేర్కొన్నారు.

వారికి ఒక్కొక్కరికి ఆగస్టు 15 వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 30 వ తేదీ మధ్య కాలానికి చెల్లించాల్సిన రూ.7,500 గౌరవ వేతనం అక్టోబర్‌ ఒకటిన వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్టు పేర్కొన్నారు. వివిధ సాంకేతిక కారణాలు, సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించని వాలంటీర్ల గౌరవ వేతనం సప్లిమెంటరీ బిల్‌ ద్వారా మిగిలిన అందరికీ అక్టోబర్‌ మొదటి వారంలో జమ చేస్తామని పేర్కొన్నారు.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

తెలంగాణలో చంద్రబాబు రీ ఎంట్రీ

జ్యోతి పోయి వెలుగు వచ్చే డాం డాం డాం