in

కామెడీ కథతో త్రివిక్రమ్

త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో అల వైకుంఠపురంలో సినిమా చేస్తున్నారు. ఈ మూవీపై అంచనాలు ఉన్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సినిమాను తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ ఎవరితో చేయబోతున్నారు అన్నది తెలియాల్సి ఉన్నది. త్రివిక్రం.. ఎన్టీఆర్ తో సినిమా ఉంటుంది అనే వార్తలు వస్తున్నాయి.

అయితే, ఎన్టీఆర్ వచ్చే ఏడాది జూన్ వరకు అందుబాటులో ఉండకపోవచ్చు. అటు ఎన్టీఆర్ తో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమా చేస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే, మెగాస్టార్ తో త్రివిక్రమ్ సినిమా ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది. గీత ఆర్ట్స్ బ్యానర్లో సినిమా తెరక్కబోతుంది. అయితే అది ఇప్పుడు కాదు. దానికి సమయం ఉన్నది. సైరా తరువాత మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది. ఈ మూవీ నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సమ్మర్ వరకు కంప్లీట్ చేసే అవకాశం ఉంది.

కాబట్టి ఈలోగా త్రివిక్రమ్ మరో సినిమా చేసే సమయం ఉంటుంది కాబట్టి ఎవరితో చేయబోతున్నారు అన్నది సస్పెన్స్. అల్లు అర్జున్ సినిమా సంక్రాంతికి వస్తుంది ఆ తరువాత మెగాస్టార్ కథపై కూర్చుంటారా లేదంటే..మరొకరితో సినిమా చేసి ఆ తరువాత కథపై కూర్చుంటారా చూడాలి. మెగాస్టార్ తో చేసే సినిమా పక్కా కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటుందని అంటున్నారు.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

ఐఐటీ మద్రాసులో మోదీ

పబ్లిక్ స్క్రీన్ లో పోర్న్.. గంటలపాటుగా