in

ఆకాష్ “రొమాంటిక్”.. పూరి ట్వీట్

పూరి జగన్నాథ్ దర్శక, నిర్మాతగా ఈమధ్యే ‘ఇస్మార్ట్ శంకర్’ అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాకు ముందు గత మూడేళ్ళుగా పూరి సరైన హిట్ లేకపోవడమే కాకుండా నిర్మాతగా కూడా చాల పోగొట్టుకున్నాడు. ఇక తన కొడుకు ఆకాష్ హీరోగా నిర్మాతగా వ్యవహరించడంతో పాటు దర్శకత్వం వహించిన “మెహబూబా పరిస్థితైతే మరింత దారుణంగా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

తన కొడుకుని హీరోగా నిలబెట్టాలని పూరి మరోసారి కొడుకుతో బీభత్సమైన రొమాన్స్ చేయించడానికి సిద్ధమవుతున్నట్లున్నాడు. అందులో భాగంగా ఈరోజు పూరి జగన్నాధ్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన ఆకాష్ పూరి కొత్త చిత్రం పోస్టర్ చెబుతుంది. అనిల్ పాదూరి అనే కొత్త డైరెక్టర్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు “రొమాంటిక్” అనే టైటిల్ ఖరారు చేసారు. అందుకు తగట్లే హీరోయిన్ ను హాగ్ చేసుకొని చాల హాట్ హాట్ గా పోస్టర్ తో యువతను తనవైపు తిప్పుకునే పని మొదలెట్టాడు.

ఇక పూరి జగన్నాధ్ దర్శకత్వంలో త్వరలో విజయ దేవరకొండ హీరోగా ‘ఫైటర్’ సినిమా మొదలు కానుంది. ఈ సినిమా వచ్చే జనవరిలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఒకవైపున దర్శకత్వం చేస్తూనే, నిర్మాతగా తన కొడుకుని మరొక దర్శకుడి చేతిలో పెట్టి, ఇండస్ట్రీలో కొడుకుని మంచి హీరో చేయడానికి పూరి జగన్నాధ్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమాను పూరి కనెక్ట్ బ్యానేర్ పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ ఇద్దరు కలసి నిర్మిస్తున్నారు.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

ఉద్యోగులకు నియామక పత్రాలు

చురుగ్గా ఉండాలంటే.. ఇలా చేయండి